కొన్ని అరుదైన కలయికలు ఫ్యాన్స్ ఎదురు చూసేలా ఉంటాయి. అలాంటిదే ఆదివారం జరిగింది. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఆరిజిన్ డే సందర్భంగా నిర్వహించిన వేడుకకు చిరంజీవి, విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా రావడంతో ఈవెంట్ కళను సంతరించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎందరో ఇన్ఫ్లూయెన్సర్లతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు విచ్చేయగా మెగాస్టార్ తో ఫ్యామిలీ స్టార్ ముచ్చటించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విజయ్ యాంకర్ గా మారిపోయి ప్రశ్నలు సందిస్తే వాటికి ఓపిగ్గా చిరంజీవి సమాధానం చెప్పడమనే ప్రక్రియను స్టేజి మీద నిర్వహించారు.
వాటిలో కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. నెగటివిటీని ఎలా ఎదురుకుంటారనే క్వశ్చన్ కు చిరు బదులిస్తూ 1977 కెరీర్ ప్రారంభంలో మదరాసు పాండీ బజారుకు వెళ్ళినప్పుడు నువ్వు హీరోవా అనే రీతిలో కొందరు ఎగతాళి చేశారని, దాంతో తాను నమ్మే హనుమంతుడు ఇచ్చిన ధైర్యంతో ముందుకు వెళ్లానే తప్ప తిరిగి తనను కామెంట్ చేసిన చోటుకి జీవితంలో మళ్ళీ కాలు పెట్టలేదని చెప్పారు. ఎవరినీ పట్టించుకోకుండా సాగడమే లైఫని వివరించారు. ఇంకో ప్రశ్నకు మాట్లాడుతూ తనకు నాన్న వెంకట్ రావే ఫ్యామిలీ స్టారని, ఆయనను చూసే కుటుంబ బాధ్యతలు తెలుసుకున్నానని అన్నారు.
బాగా కిక్ ఇచ్చిన మరో పాయింట్ ఉంది. మిడిల్ క్లాస్ మనస్థత్వాల గురించి చెబుతూ ఇంట్లో రోజు ఫ్యాన్లు, లైట్లు ఎవరూ లేనప్పుడు ఆన్ లో ఉంటే వెంటనే స్మార్ట్ ఫోన్ ద్వారా చెక్ చేసుకుని ఆపేస్తానని, సబ్బులు మిగిలిపోతే వాటిని ముద్దగా చేసుకుని తిరిగి వాడుకుంటానే తప్ప పారేయనని అన్నారు. విజయ్ దేవరకొండ సైతం షాంపూ బాటిల్ అయిపోతే కొన్ని నీళ్లు కలుపుకుని మొత్తం ఖాళీ అయ్యాకే పారేస్తానని చెప్పడం చిరుకి బాగా కనెక్ట్ అయ్యింది. ఇలా ఎన్నో విషయాలను ఇద్దరు పంచుకున్న తీరు అభిమానులకే కాదు అక్కడికి వచ్చిన ఆహూతులకు, అభిమానులకు భలే కిక్ ఇచ్చిన మాట వాస్తవం.
This post was last modified on March 31, 2024 10:21 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…