నాలుగు పదుల వయసులో హీరోయిన్లకు డిమాండ్ ఉండటం చాలా అరుదు. ఒకప్పుడు జయసుధ విజయశాంతి కాలంలో చెల్లుబాటు అయిందేమో కానీ ఇప్పటి ట్రెండ్ అభిరుచులే వేరు. కానీ త్రిష మాత్రం దానికి భిన్నంగా క్రేజీ ఆఫర్లు స్వంతం చేసుకోవడమే కాక రెమ్యునరేషన్ పరంగానూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. చెన్నై టాక్ ప్రకారం కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందబోయే థగ్ లైఫ్ కు గాను అక్షరాలా పన్నెండు కోట్ల పారితోషికం తీసుకుందట. అంటే విజయ్ తో చేసిన లియోకి ఇప్పటికి తీసుకునే మొత్తం రెట్టింపు అయ్యిందన్న మాట. డిమాండ్ అలా ఉంది మరి.
త్రిష ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర, అజిత్ విడాయుమర్చి, మోహన్ లాల్ రామ్ లో నటిస్తోంది. వీటికి సమానంగా సొమ్ము అందుకోవడం లేదు. బడ్జెట్, కాల్ షీట్లని బట్టి హెచ్చుతగ్గులున్నాయి. థగ్ లైఫ్ ఆఫర్ చేసిందే ఎక్కువ మొత్తమట. అధిక సంఖ్యలో డేట్లు అవసరం ఉండటంతో కొత్త ప్రాజెక్టులు కమిటయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి ఆ మేరకు ఇవ్వడానికి నిర్మాణ సంస్థ ఒప్పుకుందని తెలిసింది. ఇవి అధికారికంగా ప్రకటించేవి కాదు కనక ఆఫ్ ది రికార్డ్ టాక్ గానే పరిగణనలోకి తీసుకోవాలి. విశ్వంభరకు అంత ముట్టజెప్పకపోయినా టాలీవుడ్ హయ్యెస్ట్ తీసుకుందని సమాచారం.
ఇవి కాకుండా విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం(గోట్) ఒక ప్రత్యేక క్యామియో, పాట చేస్తోందని టాక్. మలయాళంలో నివిన్ పౌలీతో ఐడెంటిటీ తన ఖాతాలోనే ఉంది. డైరి ఇంత బిజీగా ఉంటే కొత్త కమిట్ మెంట్లకు ఛాన్స్ ఎక్కడిది. ఇదంతా పొన్నియిన్ సెల్వన్ పుణ్యమే. విజయ్ సేతుపతితో చేసిన 96 బ్లాక్ బస్టర్ అయినా త్రిషలో ఇంకా గ్లామర్ తగ్గలేదని నిరూపించింది మాత్రం పిఎస్ 1,2లే. కుందవైగా అందులో ఆమెని చూసి తినేది అన్నమా లేక అందమా అనే కామెంట్లు వినిపించాయి. దానికి తగ్గట్టే త్రిష సెకండ్ ఇన్నింగ్స్ మాములు జోరుతో కనిపించడం లేదు. మహర్జాతకం అంటే ఇదేనేమో.
This post was last modified on March 31, 2024 12:49 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…