ఇంకో వారం రోజుల్లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ థియేటర్లలో అడుగు పెట్టనుంది. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరో దర్శకుడు కాంబినేషన్ కావడంతో అభిమానుల అంచనాలు మాములుగా లేవు. ఖుషి బాగానే పే చేసినా విజయ్ దేవరకొండ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అందుకే ఆశలన్నీ దీని మీదే పెట్టుకున్నాడు. లైగర్ చేసిన గాయం మర్చిపోయాడు కానీ దానికన్నా ముందు వచ్చిన వరస ఫ్లాపులు మార్కెట్ ని ప్రభావితం చేసిన మాట నిజం. ఫ్యామిలీ స్టార్ కనక సరైన హిట్టు కొడితే బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచుకుని దూసుకుపోవచ్చు.
ముందు అవరోధాల సంగతి చూద్దాం. మార్చి ఎండింగ్ ని ఘనంగా ముగించిన టిల్లు స్క్వేర్ అంత సులభంగా రెండో వారంలో నెమ్మదించేలా లేడు. పైగా యూత్ మద్దతు సంపూర్ణంగా దక్కడంతో థియేటర్లు హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. దీన్ని ఎగబడి చూస్తున్న కుర్రకారుని తనవైపు తిప్పుకోవడం ఫ్యామిలీ స్టార్ కు సులభం కాదు. ఇంకోవైపు ఎండలు హోరెత్తిపోతున్నాయి. ఐపీఎల్ ఫీవర్ తో సాయంత్రాలు జనం పెద్దగా బయటికి రావడం లేదు. అన్నింటిని మించి ట్రైలర్ వచ్చాక మిశ్రమ స్పందన కనిపించింది. యునానిమస్ గా అదిరిపోయిందనే ఫీడ్ బ్యాక్ సోషల్ మీడియాలో లేదు.
ఇక అవకాశాలకు వద్దాం. హనుమాన్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాలేదు. ఎమోషన్లు, కుటుంబ అనుబంధాలను ఆధారంగా చేసుకుని ఎవరూ ఇవ్వలేదు. దర్శకుడు పరశురామ్ కనక జనాలకు సరిగ్గా కనెక్ట్ చేయగలిగితే మోత మోగడం ఖాయం. గోపి సుందర్ సంగీతం, లక్కీ గర్ల్ మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న సర్ప్రైజ్ క్యామియో, సిస్టర్ సెంటిమెంట్ ఇలా బోలెడు అంశాలు ఫ్యామిలీ స్టార్ కు వర్కౌట్ చేసేందుకు ఉపయోగపడతాయి. కాకపోతే క్లాసు, మాసుని మెప్పించేలా ఎలా హోమ్ వర్క్ చేశారనేది ఫలితాన్ని శాశిస్తుంది. మరి రౌడీ హీరో ఎలాంటి ఫలితం అందుకుంటాడో.
This post was last modified on March 30, 2024 9:34 pm
మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…
భారత్-పాకిస్థాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా యుద్ధానికి దారితీయొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతు న్న సమయంలో…
తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో…
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్‌కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…