డేనియల్ బాలాజీ.. శుక్రవారం రాత్రి హఠాత్తుగా కన్ను మూసిన తమిళ నటుడు. అతడి వయసు 48 ఏళ్లు. నటుడిగా బిజీగా ఉన్న బాలాజీ హఠాత్తుగా గుండెపోటుతో కన్ను మూయడంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. అతను చేసిన పాత్రలను గుర్తు చేసుకుంటూ ఓ మంచి నటుడు కోలీవుడ్‌కు దూరమయ్యాడే అని అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నటుడితో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం ఉంది. ఇక్కడ అతను చేసిన సినిమాలు తక్కువే కానీ.. బలమైన ముద్ర వేశాడు. గౌతమ్ మీనన్ తెలుగులో తీసిన ఘర్షణ, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలతో పాటు నాని మూవీ ‘టక్ జగదీష్’లోనూ అతను నటించాడు. ఈ మూడు చిత్రాల్లోనూ తన నటన చూసిన వాళ్లు బాలాజీని అంత సులువుగా మరిచిపోలేరు.
తమిళంలో డేనియల్ బాలాజీ చేసిన పాత్రలు.. వాటి ద్వారా వేసిన ఇంపాక్ట్ గురించి చెప్పుకోవడానికి చాలా ఉంది. ముఖ్యంగా ‘వేట్టయాడు విలయాడు’ అనే కమల్ హాసన్ మూవీలో చేసిన సైకో పాత్రతో డేనియల్ బాలాజీ ప్రేక్షకులను బెంబేలెత్తించేశాడు. ఆ పాత్ర ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉండేదంటే.. ఆ సినిమా రిలీజ్ టైంలో ఒక షాపింగ్ మాల్‌కు వెళ్లిన బాలాజీ లిఫ్ట్ ఎక్కాడట. అందులో ఉన్న అమ్మాయిలు అతణ్ని చూసి కేకలు వేసుకుంటూ బయటికి పారిపోయారు.
‘వేట్టయాడు విలయాడు’లో బాలాజీ పాత్రను చూస్తే నిజంగానే ఒళ్లు గగుర్పొడుస్తుంది. 80, 90 దశకాల్లో తెర మీద విలన్ పాత్రలను చూస్తే ఒక రకమైన భయం పుట్టేది. అప్పట్లో మీడియా లేకపోవడం వల్ల సినిమా నటుల గురించి పెద్దగా తెలిసేది కాదు కాబట్టి వాళ్లు నిజంగానే అంత క్రూరులేమో అనుకుని భయపడేవాళ్లు. ఐతే మోడర్న్ డేస్‌లో కూడా ఇలా బయట జనాలను భయపెట్టేంత క్రూరత్వాన్ని తెర మీద తన పాత్రలతో పండించిన నటుడు బాలాజీ. తనను చూడగానే ఒక రకమైన భయం కలిగేలా తెరపై నెగెటివ్ రోల్స్‌లో అదరగొట్టాడతను. ఇలాంటి మంచి నటుడు.. ఇంకా చాలా కెరీర్ ఉండగానే ఇలా హఠాత్తుగా కన్నుమూయడం బాధాకరం.
This post was last modified on March 30, 2024 5:08 pm
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…