వకీల్ సాబ్ తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్ కు బాగా గ్యాప్ వచ్చేసింది. అల్లు అర్జున్ తో ఐకాన్ ప్లాన్ చేసుకుని కథకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకుని కూడా ముందుకెళ్లలేకపోవడం తెలిసిందే. దాని స్థానంలోనే నిర్మాత దిల్ రాజు నితిన్ తో తమ్ముడు ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం దీని షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇవాళ నితిన్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన పోస్టర్ మంచి మాస్ గా ఉంది. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ టైటిల్ కావడంతో ఒక అభిమానిగా తనకిది బాధ్యతాయుతమైన మూవీగా చెప్పుకోవచ్చు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ నాని ప్రస్తావన ఎందుకో చూద్దాం.
వేణు శ్రీరామ్ గతంలో నానితో ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన వదినను విలన్ మాఫియా నుంచి కాపాడటమనే పాయింట్ ని తీసుకుని ప్రేక్షకులను మెప్పించేలా తీశాడు. మొదట్లో చిన్న చిన్న గొడవలు పడ్డా చివరికి ఒక్కటయ్యే వదినా మరుదులుగా నాని భూమికల కాంబినేషన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు తమ్ముడులో నితిన్ అక్కగా సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్ర పోషిస్తోంది. కాకపోతే దీంట్లో అత్తారింటికి వెళ్లిన సోదరి ప్రమాదంలో ఇరుక్కుంటే ఆ కుటుంబం మొత్తాన్ని తన భుజాలపై పెట్టుకుని కాపాడే పాత్ర నితిన్ దట.
కొంచెం మహేష్ బాబు అర్జున్ షేడ్స్ కనిపిస్తున్నా వేణు శ్రీరామ్ ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ షాకింగ్ గా ఉంటుందని అంటున్నారు. అందుకే ఫస్ట్ లుక్ లో లారీ, మాస్ గా కనిపించే లేడీ డ్రైవర్, భయాందోళనలో కుటుంబ సభ్యులు, పైన ఆయుధంతో నితిన్ వీటి ద్వారా కాన్సెప్ట్ ఏంటో చెప్పకనే చెప్పారు. కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుండగా అజనీష్ లోకనాథ్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ట్రీట్ మెంట్ లో వైవిధ్యం ఉంటుంది కానీ తన తన కథల్లో కోర్ పాయింట్ హీరో కుటుంబంలోని ముఖ్యమైన లేడీ క్యారెక్టర్ చుట్టే వేణు శ్రీరామ్ నడిపించడం గమనించాల్సిన విషయం.
This post was last modified on March 30, 2024 12:00 pm
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…