‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ రిలీజవుతుంటే అందరూ మాట్లాడుకోవాల్సింది ఈ సినిమా హీరో, రైటర్ సిద్ధు జొన్నలగడ్డ గురించి. కానీ ఈ మూవీ విడుదల ముంగిట హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌యే హాట్ టాపిక్‌గా మారింది. అందుక్కారణం.. ఇప్పటిదాకా తన మీద ఉన్న ట్రెడిషనల్ హీరోయిన్ ముద్రను చెరిపేసి ఈ మూవీ కోసం సూపర్ సెక్సీగా తయారవడం.. కెరీర్లో ఇంతకుముందెన్నడూ చేయని హాట్ సీన్లు ఈ చిత్రం కోసం చేయడం.
‘రౌడీ బాయ్స్’ మూవీ కోసం ఒక చిన్న లిప్ లాక్ చేసింది అనుపమ. దానికే అమ్మో అనుపమేనా అని షాకయ్యారు చాలామంది. కానీ ‘డీజే టిల్లు’లో లిప్ లాక్స్ ఒకటికి మించే ఉంటాయని.. ఇంటిమేట్ సీన్లకు కూడా కొదవలేదని.. అనుపమ లుక్స్ కూడా సూపర్ హాట్‌గా ఉండబోతున్నాయని ప్రోమోలతోనే అర్థమైంది.
ఈ రోజు రిలీజైన సినిమా చూస్తే ఆ అంచనాలే నిజమయ్యాయి. లిప్ లాక్స్ ఒకటి రెండు అంటూ లెక్కబెట్టుకుంటూ పోతే.. ఒక దశ దాటాక కౌంట్ పక్కన పెట్టేయాల్సి వస్తుంది. అలా లెక్కకు మిక్కిలి పెదవి ముద్దులే పెట్టింది సిద్ధుతో. సినిమా అంతటా కూడా ఆమె క్లీవేజ్ షో చేస్తూనే ఉంది. ఇంటిమేట్ సీన్లు అయితే పెద్దగా లేవు.
అనుపమ లాంటి హీరోయిన్ ఈ మాత్రం గ్లామర్ విందు చేయడమే చాలా ఎక్కువ. కాబట్టి యూత్‌కు ఆ మాత్రం డోస్ చాలు. ‘డీజే టిల్లు’లో నేహా శెట్టి చేసిన గ్లామర్ షో చూశాక.. ఆమెను మించి హైలైట్ కావడం కష్టమే అనుకుంటారు. కానీ అనుపమ ‘టిల్లు స్క్వేర్’లో ఆ పని సులువుగానే చేసింది. ఓవరాల్‌గా తన క్యారెక్టర్ మరీ గొప్పగా అనిపించకపోయినా.. డిజప్పాయింట్ అయితే చేయదు. ఈ సినిమా తన కెరీర్‌కు కూడా ప్లస్ అవుతుందనే భావించవచ్చు.
This post was last modified on March 29, 2024 6:16 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…