బాలకృష్ణ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన లెజెండ్ నిన్నటితో 10వ వార్షికోత్సవం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకకు టీమ్ మొత్తం హాజరై కొత్త సినిమా రేంజ్ లో సంబరాలు జరుపుకుంది. రేపు ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈవెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ త్వరలో తమ కాంబినేషన్ లో రాబోయే చిత్రం అంచనాలకు మించి ఉంటుందని, తమ కాంబినేషన్ ఎప్పుడూ మాటలు కాకుండా చేతల్లో ఫలితాన్ని చూపిస్తుందంటూ కొత్త ప్రాజెక్టుని అధికారికంగా స్టేజి మీద ప్రకటించేశారు.
లెజెండ్ దశాబ్దాల తరబడి చెప్పుకునే గొప్ప సినిమాగా నిలిచిపోయిందని, ప్రస్తుత తరంలోని మనవళ్లు, మనవరాళ్లకు సైతం కనెక్ట్ అయ్యేంత గొప్పగా బోయపాటి దీన్ని తీశారని అన్నారు. గతంలో ఇదే కలయికలో వచ్చిన సింహ, మొన్నటి ఏడాది రిలీజైన అఖండ ప్రస్తావన తీసుకొచ్చారు. మహిళల గురించి సందేశం ఇచ్చే ఇలాంటి ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆశీర్వాదం దక్కినప్పుడు కలిగే సంతోషాన్ని మాటల్లో వర్ణించలేమని అన్నారు. రేపు బాలయ్య బోయపాటి కొత్త సినిమా ప్రారంభోత్సవం జరగనుంది. లెజెండ్ నిర్మించిన 14 రీల్స్ బ్యానరే దీనికి ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారని టాక్.
సో అభిమానులకు ఉన్న డౌట్ పూర్తిగా తీరిపోయినట్టే. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న బాలకృష్ణ అది పూర్తి కావడం ఆలస్యం బోయపాటి శీను సెట్లలో అడుగు పెడతారు. అక్కడి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఎన్నికల నేపథ్యంలో కొంత గ్యాప్ తీసుకోనున్న బాలయ్య ఆ తర్వాత వరసగా షూటింగుల్లో పాల్గొంటారు. బోయపాటి మూవీలో హీరోయిన్లు ఎవరు, సంగీత దర్శకుడు ఇతరత్రా టీమ్ ఎవరనే లీక్స్ ఇంకా బయటికి రాలేదు. 1116 రోజులు ఆడిన ఏకైక తెలుగు సినిమాగా టాలీవుడ్ లో రికార్డు సృష్టించిన లెజెండ్ ని మళ్ళీ ఎవరూ దాటలేకపోయారు.
This post was last modified on March 29, 2024 11:25 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…