Movie News

సైంధవ్ విలన్ విడాకుల కథ సుఖాంతం

అనుకుంటాం కానీ స్టార్ హోదా ఉన్న నటీనటుల వ్యక్తిగత జీవితాలు అంతే అందంగా ఉంటాయన్న గ్యారెంటీ లేదు. ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో ఆధిక శాతం హీరో హీరోయిన్లు ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పడినవాళ్ళే. సైంధవ్ తో టాలీవుడ్ కు పరిచయమైన నవాజుద్దీన్ సిద్ధిక్ ఇదే కోవలోకి వస్తాడు. చిన్న సైడ్ ఆర్టిస్టుగా మొదలై టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగిన ఈ విలక్షణ నటుడు హీరోగానూ చేస్తుంటాడు. సైంధవ్ లో వెంకటేష్ తర్వాత ఎక్కువ పారితోషికం తీసుకుంది తనేనంటే ఆశ్చర్యం కలిగించినా అతని రేంజ్ గురించి తెలిసిన వాళ్ళు ఆశ్చర్యపోరు.

నవాజుద్దీన్ కి భార్య అలియాతో ఎప్పటి నుంచో పొసగడం లేదు. పద్నాలుగేళ్ల క్రితం వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట కొంత కాలం క్రితం కాపురాన్ని రచ్చకెక్కించుకుంది. తీవ్ర విభేదాలు వచ్చి కోర్టు దాకా వెళ్లారు. తన పరువు తీస్తోందంటూ నవాజుద్దీన్ ఆరోపణలు చేయగా, జీవితాన్ని నాశనం చేశాడని అలియా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఒకదశలో వీళ్ళ గొడవలు పతాక స్థాయికి చేరుకున్నాయి. తీరా చూస్తే ఇప్పుడు కలిసిపోయారట. ఇద్దరు పిల్లలు నవాజ్, షోరా పెద్దవుతున్నందున్న అన్నింటి స్వస్తి చెప్పి మానసిక ప్రశాంతత కోసం నిర్ణయం తీసుకున్నామని అలియా చెబుతోంది.

ఇదేదో ముందే చేసి ఉంటే ఇంటి గుట్టు బయట ప్రపంచానికి తెలిసేది కాదుగా. ఏదైతేనేం కలిసిపోవడం సంతోషమే. ఈ మధ్య కొంచెం స్పీడ్ తగ్గించిన నవాజుద్దీన్ సిద్ధిక్ పర్సనల్ లైఫ్ వల్లే కొన్ని మంచి అవకాశాలు వదులుకోవాల్సి వచ్చిందని సన్నిహితులు అంటుంటారు. సైంధవ్ బ్లాక్ బస్టర్ అయ్యుంటే తెలుగుకు ఒక మంచి విలన్ దొరికేవాడు కానీ సంక్రాంతి బరిలో డిజాస్టర్ కావడంతో ఇప్పటికిప్పుడు టాలీవుడ్ డైరెక్టర్లు తనను ఆప్షన్ గా పెట్టుకోవడం లేదు. సరైన బ్రేక్ ఇంకొక్కటి ఇక్కడ పడితే మనకో విలన్ కొరత తీరిపోతుంది. చూడాలి మరి ఎవరితో చేస్తాడో. 

This post was last modified on March 28, 2024 5:18 pm

Share

Recent Posts

లిక్క‌ర్ కేసు… జ‌గ‌న్ అరెస్టుకు రంగం సిద్ధమేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ అరెస్టు ఎంతో దూరంలో లేదా? ఈ ఏడాదే ఆయ‌న‌ను అరెస్టు చేయొచ్చా.? అది త‌ప్పితే.. ఆయ‌న…

45 minutes ago

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

3 hours ago

లాఠీలు గీత దాటుతున్నాయి రేవంత్ గారు

తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…

3 hours ago

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

6 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

6 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

6 hours ago