Movie News

టిల్లు అందుకే భయపడటం లేదు

ఎల్లుండి విడుదల కాబోతున్న టిల్లు స్క్వేర్ అడ్వాన్స్ బుకింగ్స్ క్రమంగా ఊపందుకుంటున్నాయి. సహజంగానే ఉన్న హైప్ కు తోడు బాక్సాఫీస్ డల్లుగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి జోష్ ఇచ్చే సినిమాగా ట్రేడ్ బోలెడంత నమ్మకం పెట్టుకుంది. దానికి తగ్గట్టే హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, నిర్మాత నాగవంశీ ప్రమోషన్ ఇంటర్వ్యూలలో బోలెడు కబుర్లు పంచుకుంటున్నారు. ప్రత్యేకంగా బౌండెడ్ స్క్రిప్ట్ అంటూ ఏదీ లేకుండా క్రేజీ కంటెంట్ తో డీజే టిల్లు లాగా ఈ స్క్వేర్ కూడా తీసుకుంటూ పోయామని టీమ్ చెప్పడం ప్రత్యేక ఆసక్తి  పెంచుతోంది.

ఇదిలా ఉండగా సీక్వెల్స్ అంతగా సక్సెస్ కాలేదనే కామెంట్లను టిల్లు అసలు లెక్క చేయడం లేదు. గతంలో కిక్ 2, మన్మథుడు 2, ఆర్య 2, సత్య 2 ఇవేవి సక్సెస్ కాలేదు. అలా అని నెగటివ్ గానే చూడాల్సిన అవసరం లేదు. బాహుబలి 2 చరిత్ర సృష్టించింది. కెజిఎఫ్ 2 పాత రికార్డులు బద్దలు కొట్టింది. హిట్ 2 ముందు వెర్షన్ కంటే బాగా ఆడింది. వీటిలో గ్రాండియర్లు, చిన్న బడ్జెట్ సినిమాలు రెండూ ఉన్నాయి. సో టిల్లు స్క్వేర్ కు టెన్షన్ అక్కర్లేదు. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే జనం ఆదరిస్తారని చెప్పడంలో అనుమానం లేదు. అందుకే ఎలాంటి లెక్కలు వేసుకోకుండా బరిలో దిగుతున్నాడు.

ముందు రోజు ప్రీమియర్లు వేసే సూచనలు ఇప్పటికైతే కనిపించడం లేదు. గతంలో ఇదే సితార బ్యానర్ నుంచి వచ్చిన మ్యాడ్, ఆదికేశవ లాంటి వాటికి స్పెషల్ ప్రీమియర్లు వేశారు. కానీ టిల్లు స్క్వేర్ కి సంబంధించి అనౌన్స్ మెంట్ రాలేదు.  ఉన్నా రేపు మధ్యాన్నానికి కానీ క్లారిటీ రాదు. అనుపమ బోల్డ్ యాక్టింగ్ తో పాటు బోలెడు సర్ప్రైజులు ఉంటాయని చెబుతున్న సిద్దు, క్లైమాక్స్ చాలా షాకింగ్ గా ఉంటుందని ఊరిస్తున్నాడు. ఇంటర్వెల్ బ్లాక్ కూడా అదే స్థాయిలో ఉంటుందట. రెండు గంటల క్రిస్పీ నిడివితో వస్తున్న ఈ ఎంటర్ టైనర్ కనక క్లిక్ అయితే సిద్దు రెండేళ్ల నిరీక్షణకు ఫలితం దక్కినట్టే. 

This post was last modified on March 27, 2024 6:29 pm

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

1 hour ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

1 hour ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

5 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

6 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

6 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

6 hours ago