Movie News

అనుపమ నిర్ణయాన్ని తేల్చే పరీక్ష

ఎప్పుడూ లేనిది గ్లామర్ టచ్ ఎక్కువగా ఉన్న పాత్రను టిల్లు స్క్వేర్ లో చేసిన అనుపమ పరమేశ్వరన్ హీరో సిద్దు జొన్నలగడ్డతో కిస్సులకు సైతం నో చెప్పకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ బోల్డ్ నెస్ గురించి పలు ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలలో ఎదురైన ప్రశ్నలకు కేరళ కుట్టి తెలివిగానే సమాధానం ఇచ్చింది. ఎప్పుడూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేసి బోర్ కొట్టిందని, అందుకే డిఫరెంట్ గా కమర్షియల్ మీటర్ లో నటనకు అవకాశమిచ్చిన లిల్లిని ఒప్పుకున్నానని క్లారిటీ ఇచ్చింది. ట్రైలర్ లో చూపించింది శాంపిల్స్ కాబట్టి అసలు కంటెంట్ వేరే లెవెల్ ఉండొచ్చు.

పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లకు కట్టుబడుతూ వచ్చిన అనుపమ తీసుకున్న నిర్ణయం రైటో కాదో ఈ శుక్రవారం తేలిపోతుంది. టిల్లు స్క్వేర్ మీద ప్రత్యేక ఆసక్తి పెరగడానికి తను కూడా ఒక కారణం కావడంతో ఫలితం పట్ల ఎగ్జైటింగ్ గా ఉండటం సహజం. అసలే బాక్సాఫీస్ బాగా డల్లుగా ఉన్న టైంలో సినిమా వస్తోంది. పాజిటివ్ టాక్ రావడం ఆలస్యం వసూళ్లు మోతెక్కిపోతాయని టీమ్ నమ్మకంగా ఉంది. అనుపమకు లాస్ట్ రిలీజ్ ఈగల్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. యాక్షన్ విజువల్స్ బాగున్నా ఎమోషన్ పండకపోవడంతో ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.

జయం రవితో తమిళంలో చేసిన సైరెన్ కూడా ఫ్లాప్ మూటగట్టుకుంది. సో టిల్లు స్క్వేర్ హిట్ కావడం చాలా కీలకం. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఆక్టోపస్ లో కీలక పాత్ర చేసింది కానీ ఇంకా దాని తాలూకు డీటెయిల్స్ బయటికి రాలేదు. మలయాళం జెఎస్కె నిర్మాణంలో ఉంది. టిల్లు స్క్వేర్ కనక బ్లాక్ బస్టర్ అయితే స్టార్ హీరోల సరసన గ్లామర్ అవకాశాలు వచ్చే ఛాన్స్ ని కొట్టిపారేయలేం కానీ ఎనిమిదేళ్ల సీనియారిటీ ఉన్న అనుపమ పరమేశ్వరన్ కు నెక్స్ట్ కథలను ఎంచుకోవడం సవాల్ గానే ఉంటుంది. సిద్దుకి చుక్కలు చూపించే లిల్లీగా టిల్లు స్క్వేర్ లో చాలా షేడ్స్ ఉంటాయట. 

This post was last modified on March 26, 2024 11:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కందుల దుర్గేశ్ రూటే సెపరేటు!

జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…

4 hours ago

టీడీపీ – జ‌న‌సేన‌ల‌కు.. వ‌క్ఫ్ ఎఫెక్ట్ ఎంత‌..!

ఏపీలో అధికార కూట‌మి మిత్ర ప‌క్షాల మ‌ధ్య వ‌క్ఫ్ బిల్లు వ్య‌వ‌హారం.. తేలిపోయింది. నిన్న మొన్న‌టి వ‌రకు దీనిపై నిర్ణ‌యాన్ని…

5 hours ago

అభిమానులను తిడితే సినిమా హిట్టవుతుందా

హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…

6 hours ago

ఎస్ఎస్ఎంబి 29 – సీక్వెల్ ఉంటుందా ఉండదా

టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే…

6 hours ago

టీడీపీలో కుములుతున్న ‘కొన‌క‌ళ్ల’.. ఏం జ‌రిగింది ..!

మ‌చిలీప‌ట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియ‌ర్ నేత కొన‌క‌ళ్ల నారాయ‌ణరావు.. త‌న యాక్టివిటీని త‌గ్గించారు. ఆయ‌న పార్టీలో ఒక‌ప్పుడు యాక్టివ్…

6 hours ago

ఆల్ట్ మన్ ట్వీట్ కు బాబు రిప్లై… ఊహకే అందట్లేదే

టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో…

7 hours ago