సరిగ్గా ఇంకో 10 రోజుల్లో ఫ్యామిలీ స్టార్ విడుదలకు రెడీ అవుతోంది. రెగ్యులర్ గా చేసే ఈవెంట్లు, ప్రెస్ మీట్లు కాకుండా టైటిల్ కు తగ్గట్టు యూనిట్ చేస్తున్న ప్రమోషన్లు వెరైటీగా ఉంటున్నాయి. ఇవాళ ఒక సాంగ్ లాంచ్ ని గేటెడ్ కమ్యూనిటీలో చేసి హొలీ పండగతో సెలెబ్రేషన్ చేసుకున్నారు. రాబోయే రెండు వారాలు విస్తృతంగా దీనికి పబ్లిసిటీ చేసేందుకు నిర్మాత దిల్ రాజు టీమ్ రెడీ అవుతోంది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కాల్ షీట్ల సమస్య వల్ల హాయ్ నాన్నకు ఎక్కువ అందుబాటులో లేకపోయింది కానీ ఇప్పుడీ ఫ్యామిలీ స్టార్ కు అలాంటి సమస్య రాలేదట.
బాక్సాఫీస్ దగ్గర ఉన్న గ్యాప్ ని వాడుకునేందుకు ఫ్యామిలీ స్టార్ కు మంచి అవకాశం దొరుకుతోంది. టిల్లు స్క్వేర్ జాతకం మార్చి 29 తేలిపోతుంది. ఒకవేళ పాజిటివ్ గా ఉన్నా ఇబ్బంది లేదు. కుటుంబ ప్రేక్షకులు తమదే ఆప్షన్ గా పెట్టుకుంటారని విజయ్ దేవరకొండ నమ్మకం. టైటిల్ తో సహా అన్ని అంశాలు క్లాసు మాస్ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉండటంతో బయ్యర్లు సైతం గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఆల్బమ్ లో మూడు పాటలు ఆల్రెడీ వచ్చేశాయి. బ్యాలన్స్ రెండు వేర్వేరు చోట్ల ఈవెంట్లతో విడుదల చేయబోతున్నారు.
సంక్రాంతి తర్వాత టాలీవుడ్ కు పూర్తి స్థాయి కిక్ ఇచ్చే సినిమా రాకపోవడంతో ఫ్యామిలీ స్టార్ కనక దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే వసూళ్లు భారీగా వస్తాయి. గత ఏడాది ఖుషికి మిక్స్డ్ టాక్ వచ్చి యావరేజ్ అనిపించుకున్నా ఓపెనింగ్స్ తో పాటు మొదటి వారం మంచి కలెక్షన్లు నమోదయ్యాయి. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయ్యుంటే గీత గోవిందం రేంజ్ వచ్చేదని ట్రేడ్ అభిప్రాయపడింది. ఇప్పుడా దర్శకుడే రౌడీ హీరోతో జట్టు కట్టడంతో సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. రష్మిక మందన్న ఒక పాటతో పాటు స్పెషల్ క్యామియో చేసిన ఫ్యామిలీ స్టార్ కు ఓవర్సీస్ లోనూ క్రేజ్ ఉంది.
This post was last modified on March 25, 2024 5:56 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…