రెండున్నర దశాబ్దాల కిందట శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ మూవీ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండు దశాబ్దాల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ చేయడానికి రెడీ అయింది శంకర్-కమల్ జోడీ. కానీ ఏ ముహూర్తాన ఈ చిత్రం మొదలైందో కానీ.. దీన్ని ఎన్నో ఇబ్బందులు వెంటాడాయి. సెట్లో క్రేన్ ప్రమాదంతో ఆగిన షూటింగ్.. తర్వాత కరోనా, ఇతర కారణాలతో ఎంతకీ మొదలు కాలేదు.
రెండేళ్లకు పైగా గ్యాప్ తర్వాత ఏడాది కిందట ‘ఇండియన్-2’ చిత్రీకరణను పున:ప్రారంభించారు. అప్పటికే శంకర్ తీస్తున్న ‘గేమ్ చేంజర్’తో పాటు ఇండియన్-2 చిత్రీకరణను సమాంతరంగా జరపాలని శంకర్ భావించాడు. కానీ ఆ ప్రణాళికలు ఫలించలేదు. ‘గేమ్ చేంజర్’ను పక్కన పెట్టి ‘ఇండియన్-2’ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు శంకర్.
ఐతే కొన్ని నెలల కిందటే ‘ఇండియన్-2’ షూట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. కానీ షూటింగ్ సుదీర్ఘ కాలం చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంతకీ పూర్తి కాకపోవడం చర్చనీయాంశం అయింది. కాగా ఇప్పుడు కమల్ ఈ సినిమాకు సంబంధించి ఆశ్చర్యకర విషయం వెల్లడించాడు. తాము కేవలం ‘ఇండియన్-2’ మాత్రమే తీయలేదని.. ఇండియన్-3కి కూడా ఒకేసారి చిత్రీకరణ జరిపామని ఆయన వెల్లడించారు. ఏవో కొన్ని సీన్లు అని కాకుండా ‘ఇండియన్-3’ మొత్తం కూడా పూర్తి చేసేసినట్లు ఆయన వెల్లడించారు.
‘ఇండియన్-2’ రిలీజయ్యాక ‘ఇండియన్-3’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలవుతాయని.. ఎక్కువ గ్యాప్ లేకుండా ఆ సినిమాను కూడా రిలీజ్ చేసేస్తామని ఆయన చెప్పారు. ఇండియన్-2 ఈ ఏడాది ద్వితీయార్ధంలో, ఇండియన్-3 వచ్చే ఏడాది ఆరంభంలో వచ్చే అవకాశాలున్నాయి.
This post was last modified on March 25, 2024 4:19 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…