ఈ మధ్య సమంత రూత్‌ప్రభు సినిమాల కంటే తన ఫొటో షూట్లే హాట్ టాపిక్. అనారోగ్యం కారణంగా వచ్చిన గ్యాప్‌తో ఆమె సినీ కెరీర్‌కు బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. గత ఏడాది ఖుషితో పలకరించాక సమంత నుంచి కొత్త సినిమానే అనౌన్స్ కాలేదు. మయోసైటిస్‌కు పూర్తి స్థాయిలో చికిత్స తీసుకుని విశ్రాంతి తీసుకునేందుకు ఆమె ఆరు నెలలకు పైగా బ్రేక్ తీసుకోగా.. ఆ తర్వాత ఆమె అందుబాటులోకి వచ్చినా సినిమా ఛాన్సులైతే పెద్దగా వస్తున్న సంకేతాలు కనిపించడం లేదు.
సమంతకు అసలు ఆఫర్లే లేవా.. లేక ఆమే సరైన పాత్రల కోసం ఎదురు చూస్తోందా తెలియదు కానీ.. ప్రస్తుతానికి ఆమె టాలీవుడ్లో ఖాళీనే. కానీ ఈ ఖాళీ సమయాన్ని ఆమె ఏమీ వృథా చేయట్లేదు. రకరకాల ఈవెంట్లలో పాల్గొంటోంది. తరచుగా హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తోంది. తనలో అందం ఏమీ తగ్గిపోలేదని.. ఒకప్పటికంటే చాలా హాట్‌గా కనిపించడానికి రెడీ అని ఈ ఫొటో షూట్ల ద్వారా సమంత చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
కొత్త ఫొటో షూట్లో అల్ట్రా మోడర్న్ డ్రెస్సింగ్‌తో సూపర్ సెక్సీగా కనిపిస్తున్న సమంతను చూస్తే నెమ్మదిగా ఒకప్పటి లుక్‌ను సంతరించుకుంటున్నట్లే కనిపిస్తోంది. త్వరలోనే ఆమె బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’తో పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మరి తెలుగులో ఆమె కొత్త సినిమా కబురు ఎప్పుడు వింటామో?
This post was last modified on March 24, 2024 4:36 pm
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్‌ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమెరికా సహా పొరుగున ఉన్న…