Movie News

10 కోట్లు దాటేసిన బ్యాంగ్ బ్రోస్

మొదటి రోజు నెమ్మదిగా మాములు ఓపెనింగ్స్ సాధించిన ఓం భీమ్ బుష్ క్రమంగా వీకెండ్స్ ని చేతుల్లోకి తీసుకుంటోంది. ఫస్ట్ డేతో పోలిస్తే శనివారం వసూళ్లు మెరుగ్గా ఉన్నాయని ట్రేడ్ టాక్. ఐపిఎల్ ప్రభావం ఉన్నప్పటికీ క్రమంగా ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నట్టు వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. యూనిట్ అఫీషయల్ గా ప్రకటించిన దాని ప్రకారం రెండు రోజుల గ్రాస్ ఆల్రెడీ 10 కోట్లు దాటేసింది. ఓవర్సీస్ లో 2.5 మిలియన్ మార్కు అందుకోవడం మరో విశేషం. టైంపాస్ కి ఢోకా లేదనే టాక్ సానుకూలంగా పని చేస్తోంది. ముఖ్యంగా యూత్ మద్దతు ఏ సెంటర్స్ లో బలంగా ఉంది.

ఇవాళ ఆదివారంతో పాటు రేపు సోమవారం హోలీ పండగ జాతీయ సెలవు దినం కలిసి రావడం ఖాయం. సుదీర్ఘమైన వీకెండ్ ని ముందే దృష్టిలో పెట్టుకుని యువి క్రియేషన్స్ వేసుకున్న స్ట్రాటజీ వర్కౌట్ అవుతోంది. పోటీకి వస్తుందనుకున్న అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు తప్పుకోవడం, కాంపిటీషన్ లో ఉన్న లైన్ మ్యాన్ లాంటివి కనీస స్థాయిలో మెప్పించలేకపోవడంతో ఓం భీమ్ బుష్ తప్ప ప్రేక్షకులకు వేరే మంచి ఛాయస్ లేదు. దీంతో శ్రీవిష్ణు టీమ్ ప్రమోషన్లను మరింత పెంచే దిశగా టూర్లు చేపట్టే ఆలోచనలో ఉన్నట్టు యూనిట్ టాక్. దీనికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది.

వచ్చే వారం టిల్లు స్క్వేర్ రాబోతున్న నేపథ్యంలో ఓం భీమ్ బుష్ కి ఈ అయిదు రోజులు చాలా కీలకం. 14 కోట్లని బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా పెట్టుకున్న ఈ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ ఆది, సోమవారాలు సరిగ్గా వాడుకుంటే దానికి చేరువగా వెళ్ళిపోతుంది. ఆపై వచ్చేవి లాభాలుగా తీసుకోవచ్చు. గత రెండు వారాలుగా చెప్పుకోదగ్గ హిట్ ఏదీ లేకపోవడంతో థియేటర్లకు సరైన ఫీడింగ్ జరగడం లేదు. మలయాళం డబ్బింగ్ ప్రేమలు మాత్రమే ఆక్యుపెన్సీలు చూపించింది. గామి ఫస్ట్ వీక్ లోనే మొత్తం రాబట్టి ఫైనల్ రన్ త్వరగా చేరుకుంది. సో బ్యాంగ్ బ్రోస్ కు ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు.

This post was last modified on March 24, 2024 12:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

2 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

3 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

3 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

4 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

5 hours ago