Movie News

వార్ 2 సంగీతం కోసం క్రేజీ ఛాయిస్

జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ వార్ 2కి మ్యూజిక్ డైరెక్టర్ లాకయ్యాడని బాలీవుడ్ టాక్. ప్రీతమ్ చక్రవర్తిని దాదాపుగా ఖరారు చేశారని తెలిసింది. క్రేజీ ఆల్బమ్స్ ఎన్నో ఇచ్చిన సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు ఇతని సొంతం. యష్ రాజ్ ఫిలింస్ ధూమ్ నుంచే ఇతని కెరీర్ ఊపందుకుంది. 2001లో ఎంట్రీ ఇచ్చిన ఈ క్రియేటివ్ టాలెంట్ తర్వాత గ్యాంగ్ స్టర్, ధూమ్ 2, భాగం భాగ్, భూల్ భులయ్యా, రేస్, లవ్ ఆజ్ కల్, అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని, వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై, రెడీ, బాడీ గార్డ్ లాంటి ఎన్నో చార్ట్ బస్టర్ ఇచ్చి విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్నాడు.

బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివకు పలు అవార్డులు దక్కించుకున్నాడు. టైగర్ 3, డంకీ ఇతని కంపోజింగ్ లో వచ్చినవే యానిమల్ లో ఒక సాంగ్ ఇచ్చాడు. వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీతో బ్లాక్ బస్టర్లలో భాగం పంచుకున్నాడు. హృతిక్ రోషన్ కి కొత్త కాదు కానీ తారక్ కి మాత్రం తను ఇచ్చే మొదటి ఆల్బమ్ అవుతుంది. త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ ల మధ్య వచ్చే ఒక స్పెషల్ సాంగ్ ని ఆర్ఆర్ఆర్ లో నాటు నాటుని మించిపోయేలా ప్లాన్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. కొరియోగ్రఫీ కూడా అదే స్థాయిలో ఉండేలా చూస్తారట.

ఈ లెక్కన అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతాయో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ముంబైలో వేసిన ప్రత్యేక సెట్లలో హృతిక్ మీద కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఏప్రిల్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ చేరతాడు. ఒకవేళ దేవర వల్ల టైం సరిపోకపోతే రెండింటికి కాల్ షీట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. కియారా అద్వానీ ఒక హీరోయిన్ కాగా రెండో జోడి ఇంకా లాక్ కాలేదు. వచ్చే ఏడాది ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ కాబోతున్న వార్ 2ని మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో తీస్తారని ముంబై టాక్. దేవర పార్ట్ 1 తర్వాత తారక్ తర్వాతి విడుదల ఇదే కాబోతోంది.

This post was last modified on March 23, 2024 6:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

1 hour ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

3 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

4 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

6 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

7 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

7 hours ago