Movie News

ప్రేమలు.. ఇది కదా సెన్సేషన్ అంటే

యుఎస్‌లో తెలుగు సినిమాలకు ఉన్న మార్కెట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని సందర్భాల్లో పెద్ద స్టార్లు నటించే బాలీవుడ్ సినిమాలను మించి తెలుగులో మిడ్ రేంజ్ సినిమాలకు ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి. తెలుగు సినిమాలకు అక్కడ రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ప్రిమియర్స్ పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తుంటారు. హై రేట్స్ పెట్టి టికెట్లు అమ్ముతుంటారు. అయినా మనవాళ్లు ఎగబడి టికెట్లు కొంటారు.

అలా అని ప్రతి తెలుగు సినిమా అక్కడ బాగా ఆడేస్తుందని చెప్పలేం. కొన్ని పేరున్న చిత్రాలు కూడా మినిమం ఇంపాక్ట్ చూపించకుండా వాషౌట్ అయిపోతుంటాయి. ఇలాంటి టైంలో మలయాళ అనువాద చిత్రమైన ‘ప్రేమలు’ యుఎస్‌లో సాధించిన వసూళ్లు చూసి ట్రేడ్ పండిట్లు షాకవుతుంటారు. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ రిలీజ్ చేసిన ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్ యుఎస్‌లో ఏకంగా 3 లక్షల డాలర్లు వసూలు చేసి ఔరా అనిపించింది.

మామూలుగా చూస్తే మలయాళ అనువాద చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లోనే పెద్దగా వసూళ్లు రాబట్టవు. ఈ మధ్య కొంచెం వాటికి డిమాండ్ పెరిగినా కూడా వసూళ్లు నామమాాత్రంగానే ఉంటాయి. కానీ ‘ప్రేమలు’ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించి ఆడేసింది. కోట్లల్లో వసూళ్లు రాబట్టింది. ఐతే తెలుగు రాష్ట్రాలను మించి యుఎస్‌లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. 3 లక్షల డాలర్లంటే చిన్న విషయం కాదు.

అసలు ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేయడమే ఆశ్చర్యం అంటే ఇంతగా కలెక్షన్లు రాబట్టడం పెద్ద షాక్. ఇదొక డబ్బింగ్ మూవీ అనే ఫీల్ రాకుండా సగటు తెలుగు లవ్ స్టోరీలా అనిపించడం.. ‘నైంటీస్ మిడిల్‌క్లాస్’ ఫేమ్ ఆదిత్య హాసన్ ట్రెండీ డైలాగ్స్ రాయడం పెద్ద ప్లస్ అయ్యాయి. హీరో హీరోయిన్లకు కూడా మన ప్రేక్షకులు బాాగా కనెక్ట్ అయ్యారు. ఒక జాలీ రైడ్‌లా సినిమా ఉండటంతో దీంతో పాటుగా రిలీజైన ‘గామి’, ‘భీమా’లకు దీటుగా వసూళ్లు రాబట్టింది.

This post was last modified on March 23, 2024 1:39 pm

Share

Recent Posts

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

2 hours ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

5 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

5 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

6 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

7 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

7 hours ago