బిగ్‍బాస్ లాంటి రియాల్టీ షోలు వయసు పై బడిన వారికి కావనేది క్లియర్‍గా తెలిసినా కానీ టీఆర్పీలకు హెల్ప్ అవుతుందని గంగవ్వను ఈసారి హౌస్‍లోకి పంపించారు. ఆమె ఏమి చేస్తుందో చూడ్డానికి అయినా ఒక వర్గం ప్రేక్షకులు షో చూస్తారనే ఎత్తుగడ కావచ్చు. అయితే ఆమె అటు ఫిజికల్ టాస్కులు చేయలేదు.
అలాగే అపరిచితులతో కలిసి జీవించే క్రమంలో ఎదురయ్యే ఒత్తిడిని ఎలా తట్టుకుంటారనే గేమ్ ఫిలాసఫీని సైతం ఆమె కోసం పక్కన పెట్టేసారు. ఆమెకు ప్రత్యేకంగా ఒక బాత్రూం కేటాయించారు. ఆమె మాటలు మినహా చేస్తున్నదేమీ లేకపోయినా కానీ సింపతీ ఫ్యాక్టర్‍తో తనకు జనం ఓట్లు గుద్దేస్తున్నారు.
ఇది మిగతా కంటెస్టెంట్స్ కి ఒక విధంగా అన్యాయం చేయడం లాంటిదే. సూర్య కిరణ్ లాంటి క్యారెక్టర్ కనీసం రెండు, మూడు వారాల పాటు హౌస్‍లో వుండాల్సిన వాడు. కానీ గంగవ్వ వన్‍సైడ్ ఓటింగ్ వల్ల అతను ఒకే వారంలో ఓడిపోక తప్పలేదు.
ఇదిలావుంటే గంగవ్వ భాష అంత తేలికగా అర్థం కాదు. ఒకటికి నాలుగు సార్లు వింటే కానీ ఆమె ఏమి చెబుతున్నదో బోధ పడదు. ఆమెతో సంభాషించాలని చూసిన నాగార్జున కూడా తానేమి మాట్లాడుతున్నదో తెలియక తెల్లమొహం వేసాడు. కాస్త నెమ్మదిగా మాట్లాడాలని కూడా సూచించాడు. ఆమె ఏమి చెబుతున్నదో అర్థమయ్యేలా చెప్పాలని జోర్దార్ సుజాతకు చెప్పాడు.
మరి ఇన్ని తిప్పలు పడుతూ ఆమెను ఎందుకు హౌస్‍లో కొనసాగించాలో బిగ్‍బాస్‍కే ఎరుక. కానీ ఈమె నామినేషన్స్ లో వున్న ప్రతిసారీ ఎవరో ఒక అర్హమైన క్యారెక్టర్ ఎగ్జిట్ అవక తప్పదు. ఎందుకంటే ఈ షోలో ఆటాడిన పద్ధతి కంటే సింపతీనే ఓటింగ్ సరళిని శాసిస్తుంది కనుక.
This post was last modified on September 13, 2020 9:30 pm
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…