టాలీవుడ్లో కొందరు యువ కథానాయకులు బహుముఖ ప్రజ్ఞాశాలులు. వాళ్లు సొంతంగా స్క్రిప్టు రాసుకోగలరు. అవసరమైన డైరెక్షన్ కూడా చేయగలరు. ఆ టాలెంట్‌తోనే తాము చేసే సినిమాలకు అన్నీ తామై వ్యవహరిస్తుంటారు. అందుకే వాళ్ల సినిమాలు హిట్టయితే ఎక్కువ క్రెడిట్ దర్శకులను మించి అందుకుంటూ ఉంటారు. ఈ జాబితాలో అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి వాళ్లుంటారు. శేష్ చేసే ప్రతి సినిమాకూ మేజర్ క్రెడిట్ తనకే దక్కుతుంటుంది. అందుకు అతను రైటింగ్‌తో పాటు మేకింగ్‌లోనూ శ్రద్ధ వహించడమే కారణం. ఇలాంటి ఇమేజే సిద్ధు సైతం తెచ్చుకున్నాడు.
‘డీజే టిల్లు’కు అతనే స్క్రిప్టు అందించడం.. టిల్లు పాత్ర భలేగా పేలడంతో దర్శకుడు విమల్ కంటే సిద్ధుకే ఎక్కువ ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా సక్సెస్‌కు సంబంధించి మేజర్ క్రెడిట్ సిద్ధుకే వెళ్లింది.
ఇప్పుడు ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ రాబోతోంది. దర్శకుడిగా విమల్ స్థానంలోకి మల్లిక్ రామ్ వచ్చాడు. కానీ ప్రేక్షకుల ఫోకస్ అంతా సిద్ధు మీదే ఉంది. రేప్పొద్దున సినిమా హిట్టయినా క్రెడిట్ అంతా సిద్ధుకే వెళ్తుందనే అభిప్రాయాలున్నాయి.
ఇదే విషయాన్ని మల్లిక్ దగ్గర ప్రస్తావిస్తే.. అది సమస్యే కాదన్నాడు. సిద్ధుకే ఎక్కువ పేరొస్తే అది తనకు సంతోషమే అని చెప్పాడు. ‘నా తొలి చిత్రం ‘నరుడా డోనరుడా’ రీమేక్. రెండో చిత్రం ‘అద్భుతం’కి ప్రశాంత్ వర్మ కథ అందించాడు. ఆ కథలు నచ్చి తెరకెక్కించా. నేను సొంతంగా కథలు రాసుకోగలను. అలాగే వేరే వాళ్ల కథలకూ న్యాయం చేయగలను. ‘టిల్లు స్క్వేర్’ కూడా అలా ఇష్టపడే చేశా. ఈ సినిమాతో సిద్ధుకు ఎక్కువ పేరొస్తే సంతోషమే. ఎందుకంటే సిద్ధుతో నాకు ఎప్పట్నుంచో స్నేహం ఉంది. నేను, సిద్ధు, ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా 12 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాం. మాలో ఎవరు సక్సెస్ అయినా అందరం ఆనందపడతాం’ అని మల్లిక్ చెప్పాడు.
This post was last modified on March 22, 2024 6:01 pm
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…