ఒకప్పుడు నిన్నే పెళ్లాడతా, గులాబీ లాంటి బ్లాక్ బస్టర్స్ తో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ ఆ తర్వాత ఎన్నో మంచి సినిమాలిచ్చారు. కొత్తవాళ్లతో చందమామ లాంటి సూపర్ హిట్స్ ని అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. ఇప్పటికీ ఇండిపెండెన్స్ డే అంటే వెంటనే గుర్తొచ్చే వాటిలో ఖడ్గం ముందు వరసలో ఉంటుంది. సిందూరంని మెచ్చుకోని విమర్శకులు లేరు. ఇదంతా గతం. ప్రస్తుతం కృష్ణవంశీ బ్యాడ్ ఫామ్ గురించి తెలిసిందే. గత ఏడాది ప్రకాష్ రాజ్ తో తీసిన రంగమార్తాండ మెప్పులు తెచ్చింది కానీ నిర్మాతకు కాసులు తేలేదు.
ఒకరకంగా చెప్పాలంటే ఇంత వెనుకబడి ఉన్న సీనియర్ దర్శకులు సాధారణంగా రిస్కులు చేయరు. కానీ ఈయన మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా కథలు రాసుకుంటూనే ఉన్నారు. తాజాగా మూడు జంటలతో ఓ ప్రేమకథను ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. డెబ్యూ యాక్టర్స్ ని తీసుకుని తక్కువ బడ్జెట్ తో ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీని చెప్పే ప్రయత్నం చేస్తారట. మూడు దశాబ్దాల క్రితం గులాబీలో యూత్ పల్స్ ని సరిగ్గా పట్టుకున్న కృష్ణవంశీ ఇంత లేట్ ఏజ్ లో అందులోనూ మారిన ట్రెండ్ కు అనుగుణంగా మెప్పిస్తారా అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న.
దీనికి సమాధానం తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి. కృష్ణవంశీ అనే కాదు బి గోపాల్, వివి వినాయక్, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు లాంటి సీనియర్లు ఇప్పటి జనరేషన్ కు అనుగుణంగా స్క్రిప్ట్ ల విషయంలో తడబడి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. స్టార్ హీరోలు అవకాశాలు ఇచ్చినా ఉపయోగించుకోలేని దాఖలాలు బోలెడు. రామ్ చరణ్ కోరిమరీ గోవిందుడు అందరివాడే చేస్తే ఏమయ్యిందో అభిమానుల కన్నా ఎక్కువగా కృష్ణవంశీకే తెలుసు. మరి ఇప్పుడు ఇది చివరి బంతిగా భావించి సిక్సర్ కొడతారో లేదో బాక్సాఫీసే సమాధానం చెప్పాలి.
This post was last modified on March 22, 2024 10:36 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…