మెగా ఫ్యామిలీతో రామ్ గోపాల్ వర్మకు ఎక్కడ శత్రుత్వం మొదలైందో ఏమో కానీ.. వాళ్ల పొడే గిట్టనట్లు ట్విట్టర్ ద్వారా, తన సినిమాల ద్వారా గిచ్చుతూనే ఉంటాడాయన. ఒక దశ దాటాక ఈ విషయంలో మరీ శ్రుతి మించి పోయాడు వర్మ. పవన్ కళ్యాణ్‌ను శ్రీరెడ్డితో బూతులు తిట్టించే స్థాయికి దిగజారిపోయాడు. అంత వరకు సైలెంటుగా ఉన్న మెగా ఫ్యామిలీ సైతం ఆ సమయంలో తీవ్ర ఆగ్రహానికి లోనైంది.
వివాదాలకు దూరంగా ఉండే అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి.. వర్మను నికృష్టుడు అని తిట్టడం తెలిసిన సంగతే. అయినా సరే వర్మ మారలేదు. తాజాగా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఓ సినిమా కూడా తీశాడు. ఆ వరుసలోనే అల్లు అరవింద్‌ను లక్ష్యంగా చేసుకుని ‘అల్లు’ అనే సినిమా తీయబోతున్నట్లు కూడా ప్రకటించాడు. ఆ సినిమా గురించి ప్రకటిస్తూ అరవింద్‌ను ఎలా టార్గెట్ చేశాడో కూడా తెలిసిందే.
ఇలాంటి సమయంలో అల్లు వారి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’లో రిలీజ్ కాబోతున్న ఒక సినిమా గురించి వర్మ ప్రమోషనల్ ట్వీట్ వేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ సినిమా పేరు.. అమరం అఖిలం ప్రేమ. దీని ట్రైలర్‌ను వర్మ ట్విట్టర్ షేర్ చేసి చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చాడు. నేరుగా ఆహాలోనే ఎక్స్‌క్లూజివ్‌గా ఈ నెల 18న విడుదల కాబోతోందీ చిత్రం. కొత్త హీరో హీరోయిన్లు విజయ్ రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా నటించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు జొనాథన్ రూపొందించాడు.
స్కూల్లో ఓ అబ్బాయి లవ్ లెటర్ ఇస్తే నాన్నకు చూపించాక రెస్పాన్స్ చెబుతా అనే ఓ అమ్మాయి.. అల్లరి చిల్లరిగా తిరిగే ఓ అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథ ఇది. ట్రైలర్ చూస్తే సినిమా ట్రెండీగా, యూత్‌ఫుల్‌గానే కనిపిస్తోంది. హీరోయిన్ తండ్రిగా కీలక పాత్ర చేసిన శ్రీకాంత్ అయ్యంగార్ వర్మకు క్లోజ్. ఆయన సినిమాల్లో కీలక పాత్రలు చేశాడు. అతడి కోసమే వర్మ ఈ ట్రైలర్‌ను షేర్ చేసి ప్రమోట్ చేసినట్లున్నాడు. ఈ మధ్యే హఠాత్తుగా గుండెపోటుగా ప్రాణాలు కోల్పోయిన సుకుమార్ మిత్రుడు ప్రసాద్.. ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం కావాల్సింది. కానీ సినిమా విడుదలయ్యే లోపు హఠాత్తుగా కన్నుమూశాడు.
This post was last modified on September 14, 2020 9:48 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…