మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలక పాత్ర ఇస్తామంటే ఎవరైనా నో చెబుతారా? తెలుగు అనే కాక ఇండియాలో ఏ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ల్ అయినా చిరు సినిమా అంటే నటించడానికి ఎంతో ఎగ్జైట్ అవుతారు. కానీ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం చిరుకు రెండుసార్లు నో చెప్పాడట. అది కూడా ఒక్క సినిమా కోసమే నాలుగేళ్ల వ్యవధిలో రెండుసార్లు చిరుకు నో చెప్పాల్సి వచ్చిందట పృథ్వీరాజ్. దీని గురించి అతను తాజాగా మాట్లాడాడు.
‘‘హిస్టారికల్ ఫిలిం ‘సైరా’ కోసం చిరంజీవి గారు నన్ను సంప్రదించారు. ఆ సినిమాలో ఓ కీలక పాత్రకు నన్ను అడిగారు. అందులో నటించాలని ఆసక్తి ఉన్నా కుదరలేదు. అప్పటికి నా డేట్లన్నీ ‘ఆడుజీవితం’ అనే లార్జర్ దన్ లైఫ్ సినిమా కోసమే ఇచ్చేశానని చెబితే ఆయన అర్థం చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత చిరంజీవి గారు ‘లూసిఫర్’ను రీమేక్ చేయాలనుకున్నారు. అందుకోసం నన్ను మళ్లీ అడిగారు. కానీ నాలుగేళ్ల తర్వాత కూడా నేను ‘ఆడుజీవితం’ కోసమే డేట్లు ఇచ్చేశానని, ఖాళీ లేదని చెబితే ఆయన ఆశ్చర్యపోయారు’’ అని పృథ్వీరాజ్ చెప్పాడు. ‘ఆడుజీవితం’ పృథ్వీరాజ్ కెరీర్లోనే అత్యంత కష్టపడి చేస్తున్న సినిమా.
ఈ చిత్రం కోసం అతను మామూలు కష్టం పడలేదు. 31 కేజీలు బరువు తగ్గి బక్కచిక్కి కనిపించనున్నాడు పృథ్వీరాజ్ ఇందులో. దీని ట్రైలర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనేక అవార్డులు సంపాదించదగ్గ సినిమాలా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ నెల 28న ఈ చిత్రం పలు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. తెలుగులో సైతం ‘ఆడుజీవితం’ను రిలీజ్ చేస్తున్నారు.
This post was last modified on March 21, 2024 1:25 pm
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర…
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వ తీరుపై తన వినూత్న నిరసనతో హాట్ టాపిక్గా మారారు. ఇటీవల…
భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్లో ఫామ్ కోసం ప్రయత్నిస్తూ ఉండగా ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.…