Movie News

నా ఆర్మీ లాంటిది న‌భూతో న‌భ‌విష్య‌త్‌-కౌశ‌ల్

కౌశ‌ల్ మండ‌.. తెలుగు బిగ్ బాస్ షోకు సంబంధించినంత వ‌ర‌కు ఈ పేరు ఓ సంచ‌ల‌నం. రెండో సీజ‌న్లో విజేత‌గా నిలిచిన ఈ టీవీ, సినిమా న‌టుడికి అప్ప‌ట్లో వీర లెవెల్లో ఫాలోయింగ్ వ‌చ్చింది. అదే స్థాయిలో వ్య‌తిరేక‌త కూడా ఎదుర్కొన్న సంగ‌తీ తెలిసిందే. షో నుంచి బ‌య‌టికి వ‌చ్చాక కౌశ‌ల్ చేసిన అతి ప‌లుమార్లు చ‌ర్చనీయాంశం అయింది.

త‌ర్వాత అత‌ను పెద్ద‌గా లైమ్ లైట్లో లేకుండా పోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ కొత్త సీజ‌న్ ఆరంభ‌మైన నేప‌థ్యంలో ఓ మీడియా సంస్థ‌తో అత‌ను పార్టిసిపెంట్ల గురించి మాట్లాడాడు. ఈసారి పార్టిసిపెంట్ల ఎంపిక స‌రైన విధంగా లేద‌ని కౌశ‌ల్ అభిప్రాయ‌ప‌డ్డాడు. గంగ‌వ్వను షోలోకి తీసుకురావ‌డం చాలా మంచి విష‌యం అని కౌశ‌ల్ అన్నాడు.

కేవ‌లం ఫిజిక‌ల్ టాస్క్‌ల ద్వారానే కంటెస్టెంట్లు ఫైన‌ల్‌కు చేరుకుంటార‌ని తాను అనుకోవ‌ట్లేదని.. రెండో సీజ‌న్‌లో ‌గీతామాధురి ఫిజిక‌ల్ టాస్క్‌లో పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఫైన‌ల్‌కు చేరుకుంద‌ని… ఈ లెక్క‌న గంగ‌వ్వ 10 వారాల క‌న్నా ఎక్కువే హౌస్‌లో ఉండే అవ‌కాశం ఉంద‌ని కౌశ‌ల్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

కొంచెం దుందుడుకుగా వ్య‌వ‌హ‌రిస్తే టీవీలో ఎక్కువ‌సేపు క‌నిపిస్తామ‌ని కొంద‌రు కంటెస్టెంట్లు అనుకుంటున్నారని.. అన్ని వేళ‌లా అదే జ‌ర‌గ‌దని. కావాల‌ని ఎవ‌రినైనా టార్గెట్ చేసినా అందుకు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దని కౌశ‌ల్ హెచ్చ‌రించాడు.. ఇక పార్టిసిపెంట్ల‌కు అప్పుడే ఫ్యాన్స్ క్ల‌బ్‌లు మొదలైపోయాయ‌ని.. కానీ ఓ కంటెస్టెంట్ కోసం ర్యాలీ తీస్తూ పోరాడిన కౌశ‌ల్ ఆర్మీ మాత్రం నెవ‌ర్ బిఫోర్‌.. ఎవ‌ర్‌ ఆఫ్ట‌ర్ అని కౌశ‌ల్ త‌న ఆర్మీని పొగుడుకున్నాడు.

This post was last modified on September 13, 2020 11:40 am

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

2 hours ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

3 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

3 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

4 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

4 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

5 hours ago