ఒకప్పుడు బాలీవుడ్లో రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి బోలెడంతమంది అసిస్టెంట్లకు అవకాశమిచ్చి.. వారితో సినిమాలు తీసి ఒక పెద్ద వ్యవస్థలా మారాడు.
ఇప్పుడు టాలీవుడ్లో సుకుమార్ సైతం ఇలాగే తన శిష్యులు బోలెడంతమందిని దర్శకులను చేస్తున్నాడు. కొందరిని సొంత సంస్థ ద్వారా పరిచయం చేస్తే.. కొందరికి వేరే వాళ్ల ద్వారా అవకాశాలిస్తున్నాడు. అలా దర్శకులుగా మారిన చాలామంది సుక్కుకు మంచి పేరు తెచ్చిపెడుతున్నారు. ఆ శిష్యులందరిలో సుక్కు ఎక్కువ గర్వపడేలా చేసింది బుచ్చిబాబు సానానే. ఉప్పెనతో అతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్న సినిమా అనుకున్న ఉప్పెన ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు బుచ్చిబాబు తన రెండో సినిమాకు రెడీ అయ్యాడు. ఏకంగా రామ్ చరణ్‌తో అతను సినిమా తీయబోతున్నాడు.
పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా బుధవారమే ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్‌తో కలిసి సుకుమార్ నిర్మిస్తున్నాడు. ఉప్పెనలో కూడా ఆయన నిర్మాణ భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. కాగా చరణ్‌తో బుచ్చిబాబు సినిమా కథా చర్చలు జరిగేటపుడు తనకు బుచ్చిబాబు షాకుల మీద షాకులు ఇచ్చినట్లు సుకుమార్ ప్రారంభోత్సవ వేడుకలో చెప్పారు.
ముందు అతను ఉప్పెన తరహాలోనే చిన్న సినిమా చేస్తాడని అనుకున్నానని.. కానీ కథ చెప్పాక దాని రేంజ్ వేరని అర్థమైందని సుక్కు చెప్పాడు. ఐతే హీరో ఎవరు అంటే రామ్ చరణ్ అన్నాడని.. అప్పుడు అమ్మో అనుకున్నానని, ఒకవైపు తాను కూడా చరణ్ కోసం ట్రై చేస్తుంటే బుచ్చిబాబుకు అదే హీరో కావాలా అనుకున్నానని సుక్కు చెప్పాడు. ఇక సంగీత దర్శకుడు ఎవరు అంటే ఏఆర్ రెహమాన్ అన్నాడని.. దీంతో మళ్లీ తాను షాకయ్యానని.. కానీ తన కథకు ఎవరు కావాలో వాళ్లనే బుచ్చిబాబు తీసుకున్నాడని సుకుమార్ చెప్పాడు
This post was last modified on March 20, 2024 9:57 pm
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్‌ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…