తెలుగులో శౌర్యం అనే రెగ్యులర్ మాస్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు తమిళ సినిమాటోగ్రాఫర్ శివ. ఆ తర్వాత అతను తెలుగులో తీసిన శంఖం, దరువు.. తమిళంలో తెరకెక్కించిన సిరుత్తై (విక్రమార్కుడు రీమేక్), వీరం, వివేకం, విశ్వాసం, అన్నాత్తె సగటు మాస్ మసాలా చిత్రాలే.
అలాంటి దర్శకుడు సూర్యతో జట్టు కడుతుంటే.. ఇంకో రెగ్యులర్ మాస్ మూవీనే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈసారి శివ అండ్ టీం కలిసి ఒక విజువల్ వండర్ తీస్తున్నారని.. ఈ సినిమా ఫస్ట్ టీజర్ రిలీజైనపుడే తెలిసిందే. అందులో విజువల్స్, సెట్టింగ్స్, ఎఫెక్ట్స్.. సూర్య లుక్స్, సినిమా నేపథ్యం అన్నీ చూసి ప్రేక్షకులకు మతి పోయింది. సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
లేటెస్ట్‌గా ముంబయిలో అమేజాన్ ప్రైమ్ మీట్ సందర్భంగా ఈ సినిమా నుంచి ఇంకో టీజర్ వదిలారు. తొలి టీజర్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి ఇందులో విజువల్స్. సూర్య లుక్స్, తన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే టెర్రిఫిక్ అనిపించాయి. ఇందులో విలన్ పాత్ర చేస్తున్న బాబీ డియోల్ పాత్రను కూడా పరిచయం చేశారు. అతడి ఇంపాక్ట్ కూడా మామూలుగా లేదు. లుక్స్‌తోనే అతను భయపెట్టేశాడు.
సూర్య, బాబీ మధ్య క్లాష్ ఒక రేంజిలో ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మామూలుగా లేవు. మొత్తంగా కంగువ ప్రపంచంలోకి అడుగు పెట్టే ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతి ఖాయమని అర్థమవుతోంది. ఈ సినిమా మీద సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ పెడుతున్నాడు. యువి క్రియేషన్స్ సైతం ఈ చిత్రంలో భాగస్వామి అన్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 20, 2024 7:15 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…