ఎప్పుడెప్పుడు మొదలుకానుందాని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న మహేష్ బాబు రాజమౌళి కలయికలోని ప్యాన్ ఇండియా మూవీకి అడుగులు మొదలైపోయాయి. హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో దీనికి సంబంధించిన సెట్ పనులు జరుగుతుండగా ఇంకోవైపు జపాన్ లో ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ కు హాజరైన జక్కన్న కొన్ని కీలక అప్డేట్లు పంచుకున్నారు. ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వకుండా మహేష్ తప్ప క్యాస్టింగ్ లో ఇంకెవరిని ఖరారు చేయలేదని, స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నామని అక్కడికి వచ్చిన ఫారిన్ మీడియాకు సమాచారమిచ్చారు.
విడుదల సమయంలో మహేష్ బాబుని ఇక్కడికి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. దీన్ని బట్టి ఎస్ఎస్ఎంబి ప్రోగ్రెస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పైకి ఎలా చెప్పినా క్యాస్టింగ్ కు సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు ఆల్రెడీ జరిగిపోయాయని ఇన్ సైడ్ టాక్. కాకపోతే వివరాలు లీక్ కాకుండా గుట్టుగా మైంటైన్ చేస్తున్నారు. ఒకదశలో హృతిక్ రోషన్ విలన్ గా నటిస్తాడనే ప్రచారం జరిగింది కానీ అది కూడా నిజం కాదని వినికిడి. ఊహించని కాంబోలు ఉండటం నిజమే కానీ ఆర్టిస్టుల నుంచి కాల్ షీట్స్ లాకయ్యే దాకా ఏదీ చెప్పలేమని అంటున్నారు. సో కొంచెం టైం అయితే పడుతుంది.
ఉగాదికి లాంఛనంగా ఒక ప్రెస్ మీట్ తో ఈ ప్రాజెక్టుని లాంచ్ చేయబోతున్నారని ఇప్పటికే టాక్ ఉంది. రెండు భాగాలు ఉంటుందనే అప్డేట్ కూడా ఆ రోజే ఇవ్వబోతున్నారు. ఎంత కాలంలో పూర్తవుతుందనేది మాత్రం ఇంకా చెప్పడం లేదు. బాహుబలికి అనుకోకుండా ఎక్కువ సమయం పట్టగా, ఆర్ఆర్ఆర్ కి కరోనా లాంటి అవాంతరాలు స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డుపడ్డాయి. ఎస్ఎస్ఎంబి 29కి ఎలాంటి అడ్డంకులు రాకపోతే రెండేళ్లలోనే ఫస్ట్ పార్ట్ రిలీజ్ ఉండొచ్చని తెలిసింది. అయినా రాజమౌళి ఎన్ని అనుకున్నా అన్నీ ఆయన చేతుల్లో ఉండవుగా. పరిస్థితుల ప్రభావం వల్ల నిర్ణయాలు మారొచ్చు.
This post was last modified on March 19, 2024 2:14 pm
బాలీవుడ్ లోనే కాదు మనకూ బాగా పరిచయమున్న విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్. సుమంత్ ప్రేమకథతో టాలీవుడ్ కు…
క్రిస్మస్ పండక్కి బాక్సాఫీస్ దగ్గర తీవ్రమైన పోటీ ఉంటుందని భావించారు ముందు. కానీ ఆ సీజన్ దగ్గర పడేసరికి కథ…
తెలంగాణ అసెంబ్లీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం చర్చల మధ్య తీవ్ర అభ్యంతరాలతో ముగిసింది. సభకు సంబంధించిన రోజులను…
మంచు కుటుంబ గత కొన్ని రోజులుగా కుటుంబ వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. ఈ వివాదంలో తాను కూడా భాగం అయినప్పటికీ…
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్లో తలపడుతోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ…
‘పుష్ప: ది రూల్’ సినిమా రిలీజై పది రోజులు దాటిపోయింది. ఈ తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొంచెం వీక్…