గత ఏడాది తమిళంలో మంచి విజయం సాధించిన చిన్న సినిమాల్లో ‘గుడ్ నైట్’ ఒకటి. తమిళంలో థియేటర్లలో రిలీజై సూపర్ హిట్టయ్యాక ఓటీటీలోకి వచ్చి తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించింది ఈ చిత్రం. ‘జై భీమ్’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించిన మణికందన్ ఇందులో హీరో. అతడి సరసన మీతా రఘునాథ్ అనే కొత్తమ్మాయి కథానాయికగా నటించింది. ఆ సినిమాలో ఆమెనే ప్రధాన ఆకర్షణ. చాలా సున్నితంగా కనిపించే అనాథ అమ్మాయి పాత్రలో మీతా పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
తెర మీద మనం చూస్తోంది ఒక నటిని అనే ఫీలింగే రానివ్వకుండా.. నిజంగా అలాంటి ఓ అమ్మాయిని చూస్తున్న భావన కలిగి తన పట్ల ఒక సానుభూతి కలిగేలా నటించింది మీతా. రెగ్యులర్ హీరోయిన్లకు చాలా భిన్నంగా కనిపించిన మీతా తర్వాత ఎలాంటి పాత్రల్లో నటిస్తుందా అన్న ఆసక్తి అందరిలోనూ కలిగింది.
ఒక్క సినిమాతో ఎంతో పాపులారిటీ సంపాదించిన ఈ అమ్మాయి ఇప్పుడు సడెన్‌గా పెళ్లి వార్తతో అందరికీ షాకిచ్చింది. తన సొంత ఊరు ఊటీలో ఆమె ఒక అబ్బాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. తన పేరు, ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. ఎంగేజ్మెంట్ పిక్స్ మాత్రం పెట్టి.. నా హృదయం అంటూ తనకు కాబోయే వాడి గురించి కామెంట్ పెట్టింది. ‘గుడ్ నైట్’తో వచ్చిన గుర్తింపుతో మీతాకు అవకాశాలు బాగానే వస్తాయని భావించారు.
ఎంతోమంది కుర్రాళ్లు ఇలాంటి అమ్మాయి తమ భార్యగా రావాలనుకున్నారు. కానీ వారి కలల విహారానికి బ్రేకులు వేస్తూ మీతా ఎంగేజ్మెంట్ గురించి ప్రకటించి షాకిచ్చింది. మీతా ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉందని.. ముందు పెళ్లి చేసుకుని ‘గుడ్ నైట్’ తరహా ట్రెడిషనల్ రోల్స్‌కే పరిమితం కావాలన్న ఆలోచనతో ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on March 18, 2024 4:28 pm
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్వరైల్…
అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘తండేల్’ మూవీ. తన చివరి చిత్రాలు కస్టడీ, థాంక్యూ…
సినిమాల్లో విలనీ… రియల్ లైఫ్ లో సిసలైన నాయకుడిగా సాగుతున్న ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సోమవారం నవ్యాంద్ర…