శనివారం జియో సినిమాలో హనుమాన్ హిందీ వెర్షన్ ఓటిటి స్ట్రీమింగ్ మొదలుపెట్టడం ఆలస్యం ఒక్కసారిగా ఆ యాప్ కి వ్యూయర్స్ తాకిడి అమాంతం పెరిగిపోయింది. ఎదురు చూసే కొద్దీ ఒరిజినల్ తెలుగు ప్రింట్ అందుబాటులోకి రాకపోవడం పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే అల్రెర్ట్ అయిపోయిన జీ5 సంస్థ హడావిడిగా ఆదివారం తెల్లవారకుండానే తెలుగు వెర్షన్ పెట్టేసింది. ఇప్పుడు అసలు ట్విస్టు విషయానికి వద్దాం. హిందీలో 2 గంటల 38 నిముషాలు ఉన్న హనుమాన్ తెలుగులో మాత్రం 2 గంటల 30 నిమిషాలే ఉన్నాడు.
దీంతో ఏదో ఎపిసోడ్ కట్ అయ్యిందని మూవీ లవర్స్ తెగ ఖంగారు పడ్డారు. అయితే అసలు ట్విస్టు వేరే ఉంది. తెలుగులో ఎలాంటి కత్తిరింపులు లేవు. కానీ తేడా జరిగింది. అదెలా అంటే ఫ్రేమ్ రేట్ లో వచ్చిన మార్పు వల్ల కోత పడింది. అంటే ఒరిజినల్ వెర్షన్ మైక్రో సెకండ్ల తేడాతో కొంచెం వేగంగా పరిగెత్తితే హిందీ మాత్రం సాధారణ స్పీడ్ తో థియేటర్ లో చూసిన లెన్త్ తో ఉంటుంది. అందుకే ఈ వ్యత్యాసం. అంతే తప్ప పాట, సీన్ ఏదీ తీసేయలేదు. ఇది అవగాహన లేకపోవడంతో కొందరు హనుమాన్ పూర్తిగా లేదనే అసంతృప్తి ఫీలవుతున్నారు. ఇదే సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
ఏది ఏమైనా రిలీజైన 66 రోజులకు హనుమాన్ డిజిటల్ లో రావడం విశేషమే అయినా మరీ ఇంత లేట్ చేసినా వెయిట్ చేసేంత ఓపిక డిజిటల్ ఫ్యాన్స్ లో తగ్గిపోతోంది. దీంతో పాటు సంక్రాంతికి సమాంతరంగా విడుదలైన మిగిలిన మూడు సినిమాలు నెల రోజుల లోపే ఓటిటిలో రాగా హనుమాన్ మాత్రం రెండు నెలల తర్వాత దర్శనమిచ్చింది. ఎలాగూ బాక్సాఫీస్ వద్ద ఒకటి రెండు తప్ప పెద్దగా హడావిడి చేస్తున్న సినిమాలేం లేవు. సో ఇంట్లో కూర్చుని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయడానికి హనుమాన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. వచ్చే నెల శ్రీరామనవమికి వ్యూస్ మారుమ్రోగిపోతాయి.
This post was last modified on March 18, 2024 6:59 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…