మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్నది రాజా సాబ్ 2025 సంక్రాంతికి వస్తుందనే ఊహాగానాలు మొదలైపోవడంతో అభిమానులు ఇదెంత వరకు నిజమోననే అయోమయంలో ఉన్నారు. అసలు వాస్తవాలేంటో చూద్దాం. ప్రస్తుతానికి ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికిప్పుడు అసలా ఉద్దేశమే లేదు. ముందు కల్కి 2898 ఏడి రిలీజ్ కావాలి. ఒకవేళ ఎన్నికల గొడవలో ఎందుకనుకుంటే వాయిదా పడొచ్చనే ప్రచారం నేపథ్యంలో అదే జరిగితే ఇంకో రెండు మూడు నెలలు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కొట్టి పారేయలేం.
ఇంకోవైపు రాజా సాబ్ షూటింగ్ చాలా బాలన్స్ ఉంది. పైకేదో ఎంటర్ టైనరని చెబుతున్నారు కానీ భారీ విఎఫెక్స్ వర్క్ డిమాండ్ చేసే కంటెంట్ ఇది. దానికి సంబందించిన చిత్రీకరణ ఇంకా మొదలుపెట్టనే లేదు. సో ఇవన్నీ ఒక కొలిక్కి రావాలి. ఒకవేళ సంక్రాంతికి నిజంగా రావాలనుకున్న ప్రభాస్ గుడ్డిగా ఓకే చెప్పడు. తన ప్రాణ స్నేహితులు యువి క్రియేషన్స్ విశ్వంభర ఆల్రెడీ లాక్ చేసుకుని ఉంది. పైగా తాను ఇష్టపడే చిరంజీవి హీరో. సో వాళ్ళతో అండర్ స్టాండింగ్ కుదిరితేనే రెండు క్లాష్ అవుతాయి. ఈ విషయాన్ని టిజి విశ్వప్రసాద్ ఈగల్ ఇంటర్వ్యూలో చెప్పారు కూడా.
సో డార్లింగ్ ఫ్యాన్స్ నిశ్చింతగా ఉండొచ్చు. ముందు ఫోకస్ పెట్టాల్సింది కల్కి 2898 ఏడి మీద. టాలీవుడ్ స్థాయిని ఆర్ఆర్ఆర్ మించిపోయేలా ప్రపంచానికి చాటుతుందనే అంచనాలు దీని మీద భారీగా ఉన్నాయి. ఎలక్షన్ల హంగామాతో సంబంధం లేకుండా మే 9నే వచ్చేస్తే సంతోషమే. కానీ ఫిలిం నగర్ వర్గాలు అనుమానమే అంటున్నాయి. దీని విషయమే తేలనప్పుడు ఇంకా రాజా సాబ్ గురించి డిస్కషన్ ఎందుకు. చాలా గ్యాప్ తర్వాత మిర్చి రేంజ్ మాస్ ఈ సినిమాలో చూడబోయే మాట వాస్తవమే. ముఖ్యంగా డాన్సుల్లో వింటేజ్ ప్రభాస్ దర్శనమిస్తాడని ఇప్పటికే టాక్ ఉంది.