వివాదాస్పద కంటెంట్ తో రూపొందిన రజాకార్ ఈ రోజు విడుదలైంది. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దీని మీద పలు కాంట్రవర్సీలు రేగినా ప్రమోషన్ల విషయంలో నిర్మాతలు కొనసాగించిన లో ప్రొఫైల్ వల్ల జనాలకు అంతగా రీచ్ కాలేదని ఓపెనింగ్స్ చూస్తే అర్థమైపోయింది. నిన్న రాత్రే హైదరాబాద్ లో ప్రీమియర్ షో వేసిన రజాకార్ లో క్యాస్టింగ్ ఆసక్తికరంగా ఉండటంతో పాటు విజువల్స్ ని బట్టి బడ్జెట్ కూడా బాగానే పెట్టారని అర్థమైయింది. యాట సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరునారాయణరెడ్డి నిర్మించిన ఈ పీరియాడిక్ డ్రామా ఓ వర్గంలో ఉన్న అంచనాలకు తగ్గట్టు ఉందా.
1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చాక హైదరాబాద్ ను పాలిస్తున్న నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్(మకరంద్ దేశ్ పాండే)కు రాజ్యాధికారం వదులుకోవడం ఇష్టం లేక కేంద్రాన్ని ధిక్కరించి రిజ్వి(రాజ్ అర్జున్)నేతృత్వంలో రజాకార్ సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఊళ్ళ మీద పడి హిందువులను ఊచకోత కోస్తూ మతం మారేలా ప్రేరేపించడమే వీళ్ళ పని. ఒకదశ వరకు ఇదంతా సహిస్తూ వచ్చిన హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్(రాజ్ సప్రు) ఆఖరికి సైన్యాన్ని పంపిస్తాడు. అప్పటికే లక్షలాది అమాయకుల ప్రాణాలు కోల్పోయిన నైజాం గడ్డకు చివరికి విముక్తి దక్కడమే తెరమీద చూడాల్సిన కథ.
చరిత్రలో ఉన్న రజాకార్ దురాగతాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన సత్యనారాయణ ఫస్ట్ హాఫ్ మొత్తం వాళ్ళ హింసకు సంబంధించిన ఘట్టాలను ఎక్కువగా జొప్పించడంతో రిపీట్ అనిపిస్తాయి. కొన్ని బ్లాక్స్ చాలా బాగా వచ్చాయి. ఇంద్రజ, ప్రేమలు విడివిడిగా నటించిన ఎపిసోడ్స్ పేలాయి. రెండో సగంలో రజాకార్లను కట్టడి చేయడానికి పటేల్ ఏం చేశారనే పాయింట్ మీద ఆసక్తికరమైన క్లైమాక్స్ తో ముగించారు. టేకింగ్ పరంగా బాగానే ఉన్నా డ్రామా, ఎమోషన్ పూర్తిగా పండకపోవడంతో గొప్ప చిత్రం అనిపించుకోలేపోయింది. అయినా సరే నిజాయితీ కలిగిన ప్రయత్నంగా ఈ సబ్జెక్టు మీద ఆసక్తి ఉన్నవాళ్ళను నిరాశపరచలేదు.
This post was last modified on March 15, 2024 6:10 pm
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…