ఇండియన్ సినిమాలో ఓ అరంగేట్ర హీరో మీద అత్యధిక బడ్జెట్ పెట్టిన సినిమా అంటే.. ‘జాగ్వార్’యే. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన ‘జాగ్వార్’ మీద పెట్టిన బడ్జెట్ రూ.70 కోట్లు కావడం విశేషం.
ఆ సినిమాకు కథ అందించింది మన లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కాగా.. దర్శకత్వం వహించిన బాలయ్యతో ‘మిత్రుడు’ తీసిన మహాదేవ్. కానీ ఆ చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఏవో రెండు సినిమాలు చేసి మమ అనిపించాడు నిఖిల్. ఇంకా అతడికి సరైన హిట్ పడలేదు.
నాలుగో సినిమా కోసం మళ్లీ ఒక తెలుగు దర్శకుడిని ఎంచుకోవడం విశేషం. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో పరిచయమై.. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం’, ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాలు తీసిన విజయ్ కుమార్ కొండా ఈ చిత్రానికి దర్శకుడు.
తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. నిఖిల్ తొలి సినిమా స్టయిల్లోనే ఈ చిత్రానికి ‘రైడర్’ అని టైటిల్ పెట్టారు. ఇక ఫస్ట్ లుక్ చూస్తే ఏమాత్రం కొత్తదనం కనిపించడం లేదు. మన తెలుగు స్టార్ల మాస్ సినిమాల్లో చూసినట్లుగానే ఉంది ఈ లుక్. ముఖ్యంగా ‘రేసుగుర్రం’ సినిమాలో అల్లు అర్జున్ పరుగు తీస్తూ ఉండే లుక్‌ను యాజిటీజ్ దించేసినట్లుగా కనిపిస్తోంది.
‘రైడర్’ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగులోనూ తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్ చూసిన మన జనాలకు బన్నీ కచ్చితంగా గుర్తుకొస్తాడనడంలో సందేహం లేదు. తొలి సినిమా సూపర్ హిట్టయ్యాక అంచనాలు అందుకోలేకపోయిన విజయ్‌కి ఇక్కడ కెరీర్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. రాజ్‌తరుణ్ లాంటి ఫాంలో లేని హీరోతో అతను తీసిన ‘ఒరేయ్ బుజ్జిగా’కు ఏమాత్రం బజ్ లేదు. ఈ చిత్రాన్ని ‘ఆహా’లో నేరుగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన రోజే ‘రైడర్’ ఫస్ట్ లుక్‌తో పలకరించాడు. చూస్తుంటే మన మాస్ సినిమాల్ని అటు ఇటు తిప్పి అక్కడ వడ్డించేలా కనిపిస్తున్నాడు విజయ్.
This post was last modified on September 12, 2020 11:20 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…