సుషాంత్ సింగ్ రాజ్‍పుట్‍కి న్యాయం జరిగేలా చూడాలని, బాలీవుడ్‍లో వేళ్లూనుకుపోయిన బంధుప్రీతి అతడిని బలి తీసుకుందని ముందుగా థియరీ వినిపించింది కంగన రనౌత్. మీడియా ముందుగా అదే పల్లవి ఎత్తుకుని కంగనని ఎడాపెడా ఇంటర్వ్యూలు కూడా చేసేసి బాలీవుడ్ డౌన్ డౌన్ అనేసింది. అయితే సుషాంత్ తండ్రి రియా చక్రవర్తిని వేలెత్తి చూపించడంతో మీడియా దృష్టి అటు మరలిపోయింది. కా
నీ కంగన మాత్రం మొదట్నుంచీ బంధుప్రీతి, అవుట్ సైడర్స్ టాపిక్‍కే కట్టుబడింది. రియా చక్రవర్తిని అంతా వేలెత్తి చూపిస్తున్నా, ఆమెని దోషిగా నిలబెట్టి ఎంక్వయిరీలంటూ తిప్పుతున్నా, ఆఖరుకి అరెస్ట్ చేసినా కంగన స్పందించలేదు.
ఇదిలావుండగా అటు రియా చక్రవర్తి అరెస్ట్ తో పాటు కంగన ఆఫీసుని అక్రమ కట్టడం పేరిట కూలగొట్టడం ఒకేసారి జరగడంతో రియా తరఫున గళమెత్తిన బాలీవుడ్ సెలబ్రిటీలు పనిలో పనిగా కంగనకు జరిగిన దానిని ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనికి కంగన తనదయిన శైలిలో స్పందించింది. తనకు మాఫియాకి తొత్తులయిన వారి మద్దతు అక్కర్లేదని, తనను, ఒక డ్రగ్ అడిక్ట్ ప్లస్ ఒక సూపర్ స్టార్ సొమ్ము మీద పడి బ్రతికే వాళ్లకూ (రియా చక్రవర్తి) ఒకే గాటన కట్టి మీ సింపతీ చెప్పవద్దని ఘాటుగా గడ్డి పెట్టింది.
సుషాంత్ కోసం తన పోరాటం కొనసాగుతుందని అంటూనే రియా చక్రవర్తి పట్ల కించిత్ కనికరం లేదా జాలి తనకు లేనే లేవని కంగన ఈ వ్యాఖ్యలతో తేల్చి పారేసింది.
ఇదిలావుంటే రియా తరఫున మాట్లాడుతోన్న షిబానీ దండేకర్ ‘టూ సెకండ్స్ ఫేమ్’ కోసం పాకులాడుతోందని సుషాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖాండేను కామెంట్ చేయడంతో ఫాన్స్ ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. రియా మాదిరిగా నువ్వు కూడా ఫర్హాన్ అక్తర్ డబ్బులు తిని బతికేస్తున్నావని అనడమే కాకుండా ఆమె వికీ పీడియా పేజీనిండా ‘గోల్డ్ డిగ్గర్’ అంటూ వివిధ వ్యాఖ్యలతో ఎటాక్ చేసి చుక్కలు చూపించారు.
This post was last modified on September 12, 2020 10:54 am
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…
సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…
ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…
మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…