ఇంకో పదమూడు రోజుల్లో మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు రానుంది. ఇది ప్రతి సంవత్సరం వచ్చి ఫ్యాన్స్ ఘనంగా జరుపుకునేది అయినా అభిమానుల ఎగ్జైట్ మెంట్ పలు కారణాల వల్ల వేరుగా ఉంది. వాటిలో మొదటిది గేమ్ ఛేంజర్ అప్డేట్. ఇందులో కంటెంట్ చరణ్ బర్త్ డే సందర్భంగా వస్తుందని ఇటీవలే జరిగిన లవ్ మీ ఈవెంట్ లో దిల్ రాజు చెప్పిన సంగతి తెలిసిందే. దాన్ని ఖరారు చేస్తూ ఒక రియాలిటీ షోకి జడ్జ్ గా వచ్చిన తమన్ మొదటి పాటను ఆ రోజు విడుదల చేస్తామని చెప్పడంతో ఫస్ట్ డౌట్ క్లియర్ అయిపోయింది. ఎప్పుడో లీకైన జరగండి జరగండి పాటని మళ్ళీ చెప్పనక్కర్లేదు.
సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేస్తారా లేదనేది సస్పెన్స్ గానే ఉంది. ప్రస్తుతం శంకర్ తో చర్చలు జరుగుతున్నాయని ఆయన నుంచి అంగీకారం రాగానే డేట్ తో కూడిన పోస్టర్ ని వదులుతారని తెలిసింది. ఒకవేళ ఖరారు చేసుకోలేకపోతే మాత్రం అదేమీ లేకుండా కేవలం సాంగ్ తో సరిపెడతారు. ఇదిలా ఉండగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందబోయే ఆర్సి 16 టైటిల్ ని రివీల్ చేసే అవకాశముందట. ఫస్ట్ లుక్ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే చరణ్ ఇంకా దాని మేకోవర్ కి రాలేదు. సో పేరు తప్ప ఇంకేమి ఇవ్వలేరు. టైటిల్ డిజైన్ అయ్యిందని అంతర్గతంగా వినిపిస్తోంది.
ఇక్కడితో అయిపోలేదు. ఆర్సి 17 డైరెక్టర్ గా సుకుమార్ పేరుని లాక్ చేస్తూ మైత్రి నుంచి ఒక ప్రకటన రావొచ్చని ఇంకో వార్త తిరుగుతోంది. ఏదైనా సరే చరణ్ ఎస్ చెప్పాకే బయటికి వస్తాయి. ఇంకోవైపు నాయక్ రీ రిలీజ్ తో రెండు రోజుల ముందే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. దానికి సంబంధించిన ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ గేమ్ చేంజర్ రిలీజ్ డిసెంబర్ లో ఉంటుందా లేక అంతకు ముందే వస్తుందా అనే సస్పెన్స్ మాత్రం ఇంకొన్ని రోజులు భరించక తప్పదు. పాట కోసం లాంఛ్ ఈవెంట్ చేసే ఆలోచన కూడా జరుగుతోంది.
This post was last modified on March 14, 2024 5:37 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…