సినిమా విడుదలై రెండేళ్లవుతోంది. ఓటిటి, శాటిలైట్ ఛానల్స్ అన్నింటిలో వచ్చేసింది. ముఖ్యమైన సీన్లు యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. అయినా సరే జపాన్ లో మాత్రం ఆర్ఆర్ఆర్ క్రేజ్ తగ్గడం లేదు. గత ఏడాది అక్టోబర్ 24న ట్రిపులార్ ని ఆ దేశంలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. 209కి పైగా థియేటర్లతో పాటు 30 దాకా ఐమాక్స్ స్క్రీన్లు దీని కోసం కేటాయిస్తే వారాల తరబడి హౌస్ ఫుల్స్ కలెక్షన్లతో మోత మోగించింది. కేవలం ముప్పై నాలుగు రోజుల వ్యవధిలో 300 మిలియన్ జపాన్ యెన్ కరెన్సీలో వసూళ్లు సాధించి రజినీకాంత్ ముత్తుని దాటేసి అగ్రస్థానంలో కూర్చుంది.
అలా అని ఆర్ఆర్ఆర్ ని అక్కడి జనాలు మర్చిపోలేదు. ఏదో ఒక థియేటర్ లో ఆడుతూనే ఉంది. వచ్చే 18వ తేదీని ఒక స్పెషల్ ప్రీమియర్ ను ప్లాన్ చేసి దానికి ప్రత్యేక అతిధిగా రాజమౌళి వస్తాడని ఎగ్జిబిటర్ ప్రకటించాడు. ఇంకేముంది ఆన్ లైన్ లో బుకింగ్స్ పెట్టిన నిమిషాల్లోనే టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోయాయి. దీన్ని మరోసారి పెద్ద తెరపై ఎంజాయ్ చేయాలనే లక్ష్యం ఒకటైతే జక్కన్నని లైవ్ లో కలుసుకుని తమ మనసులో మాటలు చెప్పాలనేది ఫ్యాన్స్ కోరిక. దాంతో రెండూ నెరవేరతాయని భావించి ఇలా ఎగబడి కొనేస్తున్నారు. ప్రస్తుతం బ్లాక్ లో కూడా దొరకని పరిస్థితి.
దీన్ని బట్టే ట్రిపులార్ వాళ్ళ మనసులో ఎంతగా చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. మనకన్నా ఎక్కువగా ప్రేమించేశారు. ఒకవేళయిదే ఆర్ఆర్ఆర్ ని హైదరాబాద్ లో ఏదైనా థియేటర్ లో వేస్తే ఇప్పటికిప్పుడు ఫుల్ అవ్వడం కష్టం. అంతగా మనం చూసేశాం. దాని మీద మోజు లేదు. ఓ అయిదారేళ్ళ తర్వాత వేస్తే ఓకే కానీ ఇప్పుడు కాదు. కానీ జపాన్ లో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతోంది. రాజమౌళి నిజంగానే ఆ దేశానికి వెళ్తున్నాడు. అక్కడ మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ప్రశ్న ఎవరో ఒకరు అడుగుతారు కాబట్టి ఈసారి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.
This post was last modified on March 14, 2024 3:49 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…