యువతను పెడతోవ పట్టించేలా అసభ్యకరమైన కంటెంట్ తో నడుస్తున్న కొన్ని ఓటిటిల మీద కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. వాటిని పూర్తిగా నిషేధిస్తూ బ్లాక్ చేసే దిశగా చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 18 ఓటిటిలు, 19 వెబ్ సైట్లు, 10 యాపులు, 57 సోషల్ మీడియా అకౌంట్లను నిరోధిస్తూ అధికారిక జిఓ విడుదలను బహిర్గతం చేసింది. ఏళ్ళ తరబడి సాగుతున్న ఈ అడల్ట్ కంటెంట్ దందాని పూర్తిగా అరికట్టలేకపోయినా ఇంత పెద్ద ఎత్తున బ్యాన్ కు పూనుకోవడం మిగిలిన వాళ్ళకు హెచ్చరికగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండేందుకు అవకాశమూ ఇస్తుంది.
నిజానికి ఇలాంటి ఏ రేటెడ్ కంటెంట్ సమాజం మీద చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. క్యాచీ పదాలతో ఓ యాప్ పెట్టేసి దాని ద్వారా లక్షలాది సబ్స్క్రైబర్లను ఆకట్టుకుని తద్వారా కోట్ల రూపాయల ఆదాయం సంపాదించుకోవడమనే చెడు మార్గాన్ని ఇవి సృష్టించాయి. వీటి వల్ల కాపురాల్లో చిచ్చు రగిలిన వాళ్ళు ఉన్నారు. మాయలో పడి చదువులు, ఉద్యోగాలు దెబ్బ తిన్న వాళ్ళు ఉన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు దారి తీసిన సంఘటనలు లేకపోలేదు. కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంకా బ్యాన్ చేయాల్సినవి ఉన్నాయి. వాటి మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఓ చూపు చూడాలి.
ఇది బాగానే ఉంది కానీ పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ భూతాన్ని అరికట్టేలా కూడా ఏదైనా చేయాలని నిర్మాతలు కోరుకుంటున్నారు. ఎందుకంటే రిలీజ్ రోజు మధ్యాన్నానికే థియేటర్ ప్రింట్లు పంపిణి చేస్తున్న సైట్ల వల్ల కలెక్షన్లు ప్రభావితం చెందుతున్నాయి. ఈ సమస్య ఇప్పటిది కాకపోయినా దశాబ్దాల తరబడి పరిష్కారం దొరకడం లేదు. పైపెచ్చు టెక్నాలజీ పెరిగాక ఇంకా విచ్చలవిడిగా పెరిగిపోయింది. వీటిని కట్టడి చేయాలని ఎన్నోసార్లు పోరాటాలు, నిరసనలు జరిగాయి. అయినా లాభం లేకపోయింది. ఈ బ్యాన్ అస్త్రం ఏదో భవిష్యత్తులో పైరసీ మీద కూడా ప్రయోగిస్తే బాగుంటుంది.
This post was last modified on March 14, 2024 2:05 pm
గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే…
భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కానీ దానికి సహేతుకమైన కారణం ఆమోదం దక్కుతుంది. సోషల్ మీడియా కాలంలో దీని…
ఏ సినిమాకైనా ‘ఎ’ సర్టిఫికెట్ ఎందుకు వస్తుంది? అందులో ఇంటిమేట్ సీన్ల డోస్ ఎక్కువ ఉండుండాలి. లేదంటే హింస, రక్తపాతం…
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అడ్డంగా దొరికిపోయింది. అతను పార్టీకి ఏమాత్రం…
చంద్రబాబు గవర్నమెంట్ లో అన్నింటికీ ఒక లెక్క ఉంటుంది... అది పక్కాగా ఉంటుంది. కేవలం నోటిమాటలు కాకుండా ప్రతిదానికి డేటా…
హైదరాబాద్లోని చరిత్రాత్మక విశ్వవిద్యాలయం.. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ). అనేక మంది మేధావులను మాత్రమే ఈ దేశానికి అందించడం కాదు.. అనేక ఉద్యమాలకు…