మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత కనిపించకుండా పోయిన స్వీటీ అనుష్క తాజాగా మలయాళం మూవీ కథనర్ సెట్లో అడుగుపెట్టడం అభిమానులను సంతోషం ముంచెత్తుతోంది. విశ్వంభరలో చేస్తుందనే వార్త ఆ మధ్య షికారు చేసింది కానీ ఎందుకో వద్దనుకోవడంతో ఆ ఛాన్స్ కాస్తా త్రిషకు వెళ్లిపోయింది. దర్శకుడు క్రిష్ తో ప్లాన్ చేసుకున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు శీలవతి టైటిల్ ప్రచారంలో ఉంది కానీ ఇంకా అఫీషియల్ కాలేదు. ఇక అసలు విషయానికి వస్తే కథనర్ లో అనుష్క ఘోస్ట్ తరహా పాత్ర చేయబోతోందని కేరళ టాక్. ఆ వివరాలేంటో చూద్దాం.
కథనర్ అంటే తొమ్మిదో శతాబ్దానికి చెందిన కడమత్తు అనే క్రిస్టియన్ మత బోధకుడు, యోధుడి కథ. ఈయన హయాంలోనే కల్లియన్ కట్టు నీలి (అనుష్క) అనే అమ్మాయి ఉండేది. ట్రావెన్కోర్ కు సంబంధించిన జానపద పాటల్లో ఈమె ప్రస్తావన లేకుండా పాటలు పాడరు. అందమైన దేవత రూపంలో ఉండే దెయ్యంగా నీలి గురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. దేవదాసి కూతురిగా పుట్టి కుటుంబంలోని అనూహ్య పరిణామాల వల్ల చేతబడులకు గురై చివరికి ఆత్మగా మారే క్రమంలో బోలెడు డ్రామా చోటు చేసుకుంటుంది. నీలికి కడమత్తుకు సంబంధం ఏంటనేది సస్పెన్స్.
ఇక్కడ చెప్పింది చాలా తక్కువ కానీ కథనర్, నీలిల గురించి కేరళ సాహిత్యంలో బోలెడు కంటెంట్ ఉంది. దాన్ని ఆధారంగా చేసుకునే దర్శకుడు రోజిన్ థామస్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ చెప్పిన డీటెయిల్స్ యూనిట్ అధికారికంగా చెప్పింది కాకపోయినా విశ్వసనీయ వర్గాల నుంచి లీకైనదే. మొత్తం రెండు భాగాలుగా ప్యాన్ ఇండియా రేంజ్ లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. 2025 విడుదలకు ప్లాన్ చేసుకుంటున్న ఈ పీరియాడిక్ థ్రిల్లర్ లో ఊహించని మలుపులు, షాకిచ్చే ఎపిసోడ్లు బోలెడు ఉంటాయట. ఈ లెక్కన అనుష్కని గతంలో ఎన్నడూ చూడని షాకింగ్ పాత్రలో చూడబోతున్నాం.
This post was last modified on March 12, 2024 11:02 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…