ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతటా సీక్వెల్స్, పార్ట్-2ల హవా నడుస్తోంది. భారీ చిత్రాలు చాలా వాటికి సీక్వెల్స్ ప్రకటించేస్తున్నారు. ఇక హిట్టయిన సినిమాలకైతే ఈ ఒరవడి ఇంకా పెరుగుతోంది. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, దేవర.. ఈ జాబితా చాలా పెద్దదే.
ప్రభాస్ కొత్త చిత్రం ‘సలార్’ను కూడా రెండు భాగాలుగా తీయడానికి ఎప్పుడో ప్రణాళికలు రచించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. పార్ట్-1 గత డిసెంబరులో రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయాన్ని అందుకుంది. అప్పుడే పార్ట్-2ను ‘సలార్: శౌర్యాంగపర్వం’ పేరుతో అనౌన్స్ చేశారు. ఐతే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుంది, ఎప్పుడు రిలీజవుతుంది అనే విషయాల్లో రకరకాల ఊహాగానాలు నడిచాయి. ముందు వెంటనే సినిమాను మొదలుపెడతారని వార్తలు రాగా.. తర్వాతేమో ఇప్పుడిప్పుడే ఆ మూవీ ఉండదని ప్రచారం జరిగింది.
ఐతే ‘సలార్’లో వరదరాజ మన్నార్‌గా కీలక పాత్ర పోషించిన మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్.. ‘సలార్-2’ షూట్, రిలీజ్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ‘సలార్-2’కు స్క్రిప్టు ఆల్రెడీ లాక్ అయిందని.. వచ్చే నెలలోనే షూటింగ్ ఉండొచ్చని అతను వెల్లడించాడు. అంతే కాక ‘శౌర్యాంగపర్వం’ వచ్చే ఏఢాదే విడుదలవుతుందని కూడా ప్రకటించాడు. తన కొత్త చిత్రం ‘ఆడు జీవితం’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా విలేకరులు ‘సలార్-2’ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడించాడు పృథ్వీరాజ్.
ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి’, ‘రాజా సాబ్’ చిత్రాల షూటింగ్‌తో తీరిక లేకుండా ఉన్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇంత బిజీలో ప్రభాస్ ‘సలార్-2’కు ఎలా డేట్లు కేటాయించి వచ్చే ఏడాది సినిమా రిలీజయ్యేలా చూస్తాడో మరి.
This post was last modified on March 11, 2024 9:55 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…