బిగ్‍బాస్‍: నోయెల్‍ ఓవరాక్షన్‍… దివి ఎట్రాక్షన్‍!

బిగ్‍బాస్‍ లేటెస్ట్ సీజన్‍ ఇంకా ఆరంభ దశలోనే వుంది కానీ డ్రామాకి అయితే లోటుండడం లేదు. జనాలకు బాగా తెలిసిన వారు చాలా తక్కువ మంది వున్నా కానీ వివిధ వ్యక్తిత్వాలున్న వాళ్లు హౌస్‍లోకి వెళ్లడంతో ఇంతవరకు గేమ్‍ రసపట్టుకి చేరుకోకపోయినా ఆడియన్స్కి కాలక్షేపమయితే అయిపోతోంది. ప్రతి సీజన్‍లానే ఈసారి కూడా బిగ్‍బాస్‍ని కాచి వడపోసిన క్యారెక్టరొకటి హౌస్‍లోకి వెళ్లింది.

సింగర్‍ కమ్‍ యాక్టర్‍ నోయెల్‍ షాన్‍ బిగ్‍బాస్‍ సీజన్లన్నీ చూసేసి అవసరమైన దానికంటే ఎక్కువ ఇన్‍ఫర్మేషన్‍ బుర్రలో ఫీడ్‍ చేసేసుకున్నాడు. దీంతో అక్కడ ఏమి జరిగినా, ఎవరు ఏమి మాట్లాడినా అది గేమే అనుకుంటున్నాడు. తాను అనుకోవడమే కాకుండా మిగతా వాళ్లను కూడా నమ్మించేస్తున్నాడు. ఆ కన్‍ఫ్యూజన్‍లో లాస్య, కళ్యాణి, అభిజీత్‍, హారిక లాంటి వాళ్లు ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిలో వెర్రి వెంగళాయ్‍లు అయిపోయారు.

ఇదిలా వుంటే కుర్రాళ్లకు తెగ నచ్చేసిన దివి (మహర్షి ఫేమ్‍) మొదటి రెండు రోజులు కామ్‍గా వున్నా సైలెంట్‍గా అన్నీ గమనిస్తున్నానని, అలాగే తనను ఎవరూ అంత ఈజీగా ఇన్‍ఫ్లుయన్స్ చేయలేరని చాటుకుని మరింతమంది అభిమానుల్ని సంపాదించుకుంది.

దివికి పెరుగుతోన్న ఫాన్‍ బేస్‍ చూసి బిగ్‍బాస్‍ ఎడిటర్లు ఆమెను కవర్‍ చేయడం మొదలు పెట్టారు. అలాగే గంగవ్వ తన పంచ్‍లతో, సూర్యకిరణ్‍ తన నిశిత దృష్టితో ఒక వర్గం వారి అభిమానాన్ని చూరగొంటున్నారు.