తెరమీద హీరో హీరోయిన్లు నిజ జీవితంలో భార్యా భర్తలు కావడం చాలా చూశాం. కృష్ణ విజయనిర్మల, నాగార్జున అమలతో మొదలుపెట్టి ఇప్పటిదాకా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఈ లిస్టులో కుర్ర హీరో కిరణ్ అబ్బవరం చేరిపోయాడు. తన డెబ్యూ మూవీ రాజావారు రాణిగారులో జోడిగా నటించిన రహస్య గోరఖ్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎల్లుండి 13న పరిమిత అతిథుల మధ్య నిశ్చితార్థం జరిపి త్వరలోనే వివాహ వేడుక చేసుకోబోతున్నారు. నిజానికి ఈ ఇద్దరూ లివ్ ఇన్ లో ఉన్నారని గతంలో కథనాలు వచ్చాయి. ఒక టాక్ షోలో కిరణ్ సిగ్గుపడుతూ ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు కూడా.
ఫైనల్ గా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. హీరోగా అప్ కమింగ్ స్టేజిలో ఉన్న కిరణ్ అబ్బవరంకు వినరో భాగ్యము విష్ణుకథ డీసెంట్ హిట్ తర్వాత మీటర్, రూల్స్ రంజన్ ఫ్లాపయ్యాయి. ప్రస్తుతం దిల్ రుబా పూర్తి చేసే పనిలో ఉన్న కిరణ్ మరో పీరియాడిక్ డ్రామాని ఒప్పుకున్నాడు. ప్యాన్ ఇండియా బడ్జెట్ తో హనుమాన్ నిర్మాత గతంలో ఓ ప్రాజెక్టు ప్లాన్ చేశారు కానీ దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇక రహస్య గోరఖ్ విషయానికి వస్తే తెలుగమ్మాయే. రాజావారు రాణిగారుకు ముందు ఆకాశమంత ప్రేమ లాంటి షార్ట్ ఫిలింస్ పేరు తెచ్చి పెట్టాయి.
తెరంగేట్రం తర్వాత రహస్య మళ్ళీ తెలుగు సినిమాలు చేయలేదు. తమిళంలో షర్బత్ అనే మూవీ చేసినా ఫలితం దక్కలేదు. మళ్ళీ తెరమీద కనిపించలేదు. కిరణ్ తో పలు సందర్భాల్లో బయట కనిపించినా తమరిలేషన్ గురించి ఎక్కడ ఓపెన్ కాలేదు. ఒకరకంగా యూత్ హీరోల్లో త్వరగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నది కిరణ్ అనే చెప్పాలి. వెడ్డింగ్ కూడా డెస్టినేషన్ తరహాలో ప్లాన్ చేస్తారట. అదయ్యాక ఇండస్ట్రీకి హైదరాబాద్ లో ఒక రిసెప్షన్ ఇస్తారని తెలిసింది. ఈ కారణంగానే కిరణ్ షూటింగులకు కొంత బ్రేక్ తీసుకుని మూడు ముళ్ళు వేశాక మళ్ళీ సెట్స్ లో అడుగుపెడతాడని సమాచారం.
This post was last modified on March 11, 2024 3:35 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…