ఈ సంవత్సరం భారతదేశాపు ఏ సినిమాకు ఆస్కార్ రాకపోవడం మూవీ లవర్స్ ని నిరాశ పరిచేదే అయినా హాలీవుడ్ ప్రామాణికాలకు అనుగుణంగా ఇచ్చే అవార్డులు కాబట్టి మనకు ఇవ్వకపోయినా స్థాయి తగ్గినట్టు కాదు, గొప్ప చిత్రాలు తీయలేదని కాదు. అయితే గత ఏడాది ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు గాను ఎంఎం కీరవాణి ఇదే వేదికపై సగర్వంగా అందుకోవడం ఇంకా కళ్ళముందు ఉంది. ఈసారి అలాంటి గౌరవం ఇండియన్ మూవీకి దక్కలేదు కానీ వేదికపై ట్రిపులార్ లోని కొన్ని యాక్షన్ షాట్స్, నాటు సాంగ్ లోని తారక్ చరణ్ ల డాన్సింగ్ విజువల్స్ చూపించడం ఆనందాన్ని నింపింది.
రాజమౌళి బృందం చేసిన అశేష కృషి అందుకున్న ఘనత మళ్ళీ ఎప్పుడు దక్కుతుందో కాలమే సమాధానం చెప్పాలి. అధిక శాతం జనాలు ఊహించినట్టే ఓపెన్ హెయిమర్ మొత్తం 7 ఆస్కార్లతో మోత మోగించింది. ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, సపోర్టింగ్ యాక్టర్, ఒరిజినల్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ లో అవార్డులు అందుకుంది. సిసిలియన్ మర్ఫీ, క్రిస్టోఫర్ నోలన్ లు ఏ మాత్రం నిరాశ పరచకుండా ట్రోఫీ అందుకోవడం అభిమానులకు గూస్ బంప్స్ క్షణంగా నిలిచిపోయింది. పూర్ థింగ్స్ కి 4 దక్కగా, కిల్లర్ అఫ్ ది ఫ్లవర్ మూన్ కి ఒక్కటీ రాకపోవడం షాక్ ఇచ్చింది.
రాబోయే రోజుల్లో ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ఆస్కార్ కి పోటీ పడే కంటెంట్ తీసేందుకు మన దర్శకులు పోటీ పడతారని చెప్పడంలో సందేహం లేదు. రాజమౌళి ఆల్రెడీ జెండా పాతేశాడు. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ భవిష్యత్తులో తప్పకుండా అవతార్ రేంజ్ విజువల్ వండర్ తీస్తానని చెప్పడం ముందు ట్రోలింగ్ కి గురైనా తక్కువ బడ్జెట్ లో అతను చేసిన అద్భుతం చూసి నమ్మకం తెచ్చుకున్నారు. జక్కన్న మహేష్ బాబు కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీకి ఓ రెండేళ్ల తర్వాత ఏ స్థాయిలో అకాడమీ అవార్డులు వస్తాయో ఊహించుకోవడం కష్టమే.
This post was last modified on March 11, 2024 10:47 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…