ఈ వారం సినిమాల్లో గామి చాలా స్పెషల్. ఈ సినిమా పూర్తి చేయడానికి ఏకంగా ఆరేళ్లు పట్టింది. ఓ కొత్త దర్శకుడు యంగ్ టీంను పెట్టుకుని పరిమిత వనరులతో ఎంత కష్టపడ్డాడో మేకింగ్ వీడియోలు, ప్రోమోలు చూస్తేనే అర్థమైంది. తెరమీద సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఒక కొత్త అనుభూతికి లోనయ్యారు.
ఐతే ప్రయోగాత్మక కథతో తెరకెక్కిన ఇలాంటి సినిమాలను సామాన్య ప్రేక్షకులు ఎంతమేర ఆదరిస్తారో.. ఇది కమర్షియల్‌గా ఆడే సినిమానేనా అనే సందేహాలు విడుదలకు ముందు వ్యక్తమయ్యాయి. కానీ గామి అంచనాలకు మించి వసూళ్లు రాబడుతోంది. తొలి రోజే వరల్డ్ వైడ్ ఈ మూవీకి 9 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. రెండో రోజు కూడా ఆరు కోట్ల దాకా వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా రేంజికి ఈ వసూళ్లు గొప్పే.
ఇక గామి మూవీ ఒక ఏరియాలో రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ అయిపోవడం విశేషం. అమెరికాలో ఈ చిత్రం శనివారం షోలు పూర్తయ్యేసరికే 4 లక్షల డాలర్ల మార్కును అందుకుంది. బయ్యర్ పెట్టుబడి మొత్తం శనివారానికే వెనక్కి వచ్చేసింది. ప్రిమియర్స్ నుంచే మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రానికి శుక్ర, శనివారాల్లో కూడా యుఎస్‌లో మంచి వసూళ్లు వచ్చాయి. అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గ క్లాస్, వెరైటీ మూవీ కావడంతో దీనికి మంచి ఆదరణ దక్కుతోంది.
ఈ సినిమా ఊపు చూస్తుంటే ఇంకో వారం కూడా బాగానే ఆడేలా ఉంది. వచ్చే వారం చెప్పుకోదగ్గ రిలీజ్‌లు ఏమీ లేవు. కాబట్టి ఫుల్ రన్లో మిలియన్ డాలర్ మార్కును కూడా గామి అందుకుంటే ఆశ్చర్యం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా త్వరలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే సంకేతాలు కనిపిస్ఉతన్నాయి.
This post was last modified on March 11, 2024 10:05 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…