మొన్నటిదాకా పృథ్విరాజ్ సుకుమారన్ అంటే మనకంతగా పరిచయం లేదు కానీ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ లో ప్రభాస్ ప్రాణ స్నేహితుడు వరదరాజ మన్నార్ పాత్రలో చూశాక ఒక్కసారిగా దగ్గరివాడు అయిపోయాడు. అందుకే ఇతని సినిమాలు క్రమంగా ప్యాన్ ఇండియా ఫ్లేవర్ తో తెలుగులోనూ రాబోతున్నాయి. వాటిలో ది గోట్ లైఫ్ ఆడు జీవితం ఒకటి. ఈ నెల మార్చి 28 విడుదలకు రెడీ అవుతోంది. దీంట్లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది భారీ బడ్జెట్ తో ఆరుదైన లొకేషన్లలో తీసిన సర్వైవల్ థ్రిల్లర్. కొంతసేపు మినహాయించి సినిమా మొత్తం ఒకే పాత్రతో వివిధ ప్రాంతాల్లో జరుగుతుంది.
జాతీయ అవార్డు దక్కించుకున్న బ్లెస్సీ దర్శకత్వంలో రూపొందిన ఆడు జీవితంలో అమలా పాల్ హీరోయిన్. లెజెండరీ మ్యుజిషియన్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. దట్టమైన ఎడారిలో మండుటెండల మధ్య నెలల తరబడి నిర్మాణం జరిగింది. ప్రముఖ రచయిత బెన్యామిన్ ఇదే టైటిల్ తో రాసిన సూపర్ హిట్ నవల ఆధారంగా దీన్ని రూపొందించారు. పృథ్విరాజ్ షాకింగ్ గెటప్స్ లో కనిపిస్తాడు. కమర్షియల్ వాసనలు మచ్చుకు కూడా లేని గోట్ లైఫ్ ని ముందు ఏప్రిల్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ తర్వాత మార్చుకుని మార్చి ఆఖరి వారానికి తీసుకొస్తున్నారు.
అన్ని ప్రధాన భాషల్లో ఆడు జీవితం డబ్బింగ్ కానుంది. పృథ్విరాజ్ నటుడిగా మాత్రమే కాదు చిరంజీవి గాడ్ ఫాదర్ ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ దర్శకుడిగానూ చాలా పేరుంది. సలార్ 2 శౌర్యంగ పర్వంలో ప్రభాస్ తో సమానంగా తనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇకపై తాను నటించిన అన్ని చిత్రాలు తెలుగులో డబ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో ఒకటి రెండు అనువాదం చేశాక బిజినెస్ లేక ఆగిపోయాయి. ఈసారి సమస్య లేకుండా ట్రైలర్ తోనే అంచనాలు తెచ్చుకున్నారు. టిల్లు స్క్వేర్ తో ఆడు జీవితం పోటీ పడనుంది.
This post was last modified on March 10, 2024 10:36 am
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల జల్లుకురిపించారు. దక్షిణాది సినీ రంగానికి చిరంజీవి ఐకాన్.. అని పేర్కొన్నారు.…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు మాట కు తెలుగు ఓటరు ఓటెత్తాడు.…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ…
అరవింద్ కేజ్రీవాల్... దేశ రాజకీయాల్లో రీసౌండ్ ఇచ్చిన పేరిది. ఇటు అధికార బీజేపీతో పాటుగా అటూ నాడు అధికారంలో ఉన్న…
అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరి 29న వాషింగ్టన్ సమీపంలో అమెరికన్ ఎయిర్లైన్స్ జెట్, ఆర్మీ హెలికాప్టర్…
రెండేళ్ల కిందట తమిళంలో లవ్ టుడే అనే చిన్న సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసింద తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్…