కొన్ని నెలల కిందట స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన కర్రీ అండ్ సైనైడ్-ది జాలీ జోసెఫ్ కేస్ డాక్యుమెంటరీ ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. కేరళలో తన కుటుంబ సభ్యులు, బంధువులనే వేర్వేరు కారణాలతో సైనైడ్ పెట్టి హత్య చేసిన జాలీ జోసెఫ్ మీద తీసిన ఆ డాక్యుమెంటరీని దేశ విదేశాల్లో కోట్లమంది ఎగబడి చూశారు. దానికి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కొన్ని వారాల పాటు నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లో ట్రెండ్ అయింది ఆ డాక్యుమెంటరీ.
ఇప్పుడు అదే కోవలో మరో క్రైమ్ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం రేపుతోంది. అదే.. ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ-బరీడ్ ట్రూత్. ఇటీవలే ఈ క్రైమ్ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. అప్పట్నుంచి అది రిలీజైన అన్ని భాషల్లో టాప్-10లో కొనసాగుతోంది.
ఈ డాక్యుమెంటరీ చుట్టూ అనేక వివాదాలు నెలకొనడంతో రిలీజ్ విషయంలో ఇబ్బందులు తప్పలేదు. అన్ని అడ్డంకులనూ దాటి ఎట్టకేలకు ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. అక్కడ దీనికి రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. అవతార్, లవ్ ఈజ్ బ్లైండ్ లాంటి అంతర్జాతీయ సినిమాల వ్యూస్‌ను ఇది తక్కువ రోజుల్లోనే దాటేయడం విశేషం.
ఇంద్రాణి ముఖర్జియా వ్యవహారం కొన్నేళ్ల కిందట సంచలనం రేపింది. ఆమె ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు భర్తల నుంచి విడిపోయింది. మూడో భర్త కుమారుడితో ఇంద్రాణి మొదటి భర్త కూతురు ప్రేమలో పడింది. ఈ విషయమై గొడవలు జరిగి.. తన కూతురిని గొంతు నులిమి చంపేసింది ఇంద్రాణి. ఈ విషయంలో ఆమె డ్రైవర్ ద్వారా మూడేళ్ల తర్వాత బయటపడింది. వీరి కుటుంబంలో సంబంధ బాంధవ్యాలు, హత్యకు దారి తీసిన పరిస్థితులు చర్చనీయాంశం అయ్యాయి.
This post was last modified on March 10, 2024 10:13 am
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…