కర్రీ సైనైడ్ త‌ర్వాత ఈ డాక్యుమెంట‌రీనే సంచ‌ల‌నం

'The Indrani Mukerjea Story: Buried Truth' is scheduled to be released on Netflix on February 23. Photo: Netflix

కొన్ని నెల‌ల కింద‌ట స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన క‌ర్రీ అండ్ సైనైడ్-ది జాలీ జోసెఫ్ కేస్ డాక్యుమెంట‌రీ ఎంత‌టి సంచ‌ల‌నం రేపిందో తెలిసిందే. కేర‌ళ‌లో త‌న కుటుంబ స‌భ్యులు, బంధువుల‌నే వేర్వేరు కార‌ణాల‌తో సైనైడ్ పెట్టి హ‌త్య చేసిన జాలీ జోసెఫ్ మీద తీసిన ఆ డాక్యుమెంట‌రీని దేశ విదేశాల్లో కోట్ల‌మంది ఎగ‌బ‌డి చూశారు. దానికి రికార్డు స్థాయిలో వ్యూస్ వ‌చ్చాయి. కొన్ని వారాల పాటు నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లో ట్రెండ్ అయింది ఆ డాక్యుమెంట‌రీ.

ఇప్పుడు అదే కోవ‌లో మ‌రో క్రైమ్ డాక్యుమెంట‌రీ నెట్‌ఫ్లిక్స్‌లో సంచ‌ల‌నం రేపుతోంది. అదే.. ది ఇంద్రాణి ముఖ‌ర్జియా స్టోరీ-బ‌రీడ్ ట్రూత్. ఇటీవ‌లే ఈ క్రైమ్ డాక్యుమెంట‌రీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. అప్ప‌ట్నుంచి అది రిలీజైన అన్ని భాష‌ల్లో టాప్‌-10లో కొన‌సాగుతోంది.

ఈ డాక్యుమెంట‌రీ చుట్టూ అనేక వివాదాలు నెల‌కొన‌డంతో రిలీజ్ విష‌యంలో ఇబ్బందులు త‌ప్ప‌లేదు. అన్ని అడ్డంకుల‌నూ దాటి ఎట్ట‌కేల‌కు ఈ డాక్యుమెంట‌రీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. అక్క‌డ దీనికి రికార్డు స్థాయిలో వ్యూస్ వ‌స్తున్నాయి. అవ‌తార్, ల‌వ్ ఈజ్ బ్లైండ్ లాంటి అంత‌ర్జాతీయ సినిమాల వ్యూస్‌ను ఇది త‌క్కువ రోజుల్లోనే దాటేయ‌డం విశేషం.

ఇంద్రాణి ముఖ‌ర్జియా వ్య‌వ‌హారం కొన్నేళ్ల కింద‌ట సంచ‌ల‌నం రేపింది. ఆమె ఒకరి త‌ర్వాత ఒక‌రు ఇద్ద‌రు భ‌ర్త‌ల నుంచి విడిపోయింది. మూడో భ‌ర్త కుమారుడితో ఇంద్రాణి మొద‌టి భ‌ర్త కూతురు ప్రేమ‌లో ప‌డింది. ఈ విష‌య‌మై గొడ‌వ‌లు జ‌రిగి.. త‌న కూతురిని గొంతు నులిమి చంపేసింది ఇంద్రాణి. ఈ విష‌యంలో ఆమె డ్రైవ‌ర్ ద్వారా మూడేళ్ల త‌ర్వాత బ‌య‌ట‌ప‌డింది. వీరి కుటుంబంలో సంబంధ బాంధ‌వ్యాలు, హ‌త్య‌కు దారి తీసిన ప‌రిస్థితులు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి.