తల్లికి గౌరవమిస్తూ తన పేరుని సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్న సుప్రీమ్ హీరో నిన్న అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిలిం సత్య స్క్రీనింగ్ సందర్భంగా జరిపిన ప్రెస్ మీట్ లో గాంజా శంకర్ ప్రస్తావన వచ్చినప్పుడు స్పందించాడు. ఇది క్యాన్సిలయ్యిందనే వార్త మీడియాలో చదివి తెలుసుకున్నాను తప్పించి నిజంగా ఉందో లేదో రివర్స్ లో జర్నలిస్టులను ప్రశ్నించడం కొత్త సందేహాలు రేపింది. వెబ్ సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ లో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన గాసిప్స్, అప్డేట్స్ రావడం సహజం. ఇది ఇప్పుడే కాదు ఇంటర్ నెట్ లేని యుగంలోనూ దిన, వార పత్రికల్లో వచ్చేవి.
ఒకవేళ గాంజా శంకర్ నిజంగా కొనసాగిస్తూ ఉంటే అదేదో ఓపెన్ గా చెప్పేస్తే సరిపోయేది. పుకార్లని నమ్మొద్దని, గాంజా శంకర్ హీరోగా నేనే చెబుతున్నానని అంటే అభిమానులకు ఒక గ్యారెంటీ దొరికేది. కానీ సాయి దుర్గ తేజ్ ఎంతసేపూ మీకే తెలుసు అని నొక్కి నొక్కి చెప్పడం అంతు చిక్కని విషయం. నెల రోజుల క్రితమే ఈ న్యూస్ చక్కర్లు కొడుతున్నా నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం అనుమానాలను పెంచుతూ వచ్చింది. అదేదో ఇప్పుడు కుండబద్దలు కొట్టినట్టు గాంజా శంకర్ చేస్తున్నాం అనేస్తే పోయదానికి నాకేం తెలియదనడం కొత్త డౌట్లు రేపుతోంది.
ఇదొక్కటే కాదు చిత్రలహరి 2 సైతం ఒక ట్వీట్ వల్ల ఆపేయాల్సి వచ్చిందని చెప్పడం కూడా వెరైటీగా ఉంది. అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి ముందే ఎవరో లీక్ చేశారనుకుందాం. ఆ మాత్రం దానికి రద్దు చేయడం ఎందుకు కొనసాగించవచ్చు కదా. పోనీ స్టోరీనో, షూట్ చేసిన వీడియోనో లీకైతే ఏదో అనుకోవచ్చు. జస్ట్ సీక్వెల్ తీస్తున్నారని బయటికి వచ్చినంత మాత్రాన ఆపేశామని చెప్పడం ఏ కోణంలో చూసినా లాజిక్ కు అందటం లేదు. మీరే చెప్పాలి అంటూ రివర్స్ లో మీడియాని ప్రశ్నించే బదులు గాంజా శంకర్, చిత్రలహరి 2 ఖచ్చితంగా ఉంటాయో లేదో చెప్పేస్తే ఈ చర్చే ఉండేది కాదుగా.
This post was last modified on March 9, 2024 11:33 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…