సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ శంకర్.. తన ఆగమనాన్ని ఘనంగా చాటిన సినిమా ‘జెంటిల్ మేన్’. అర్జున్ కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన ఆ చిత్రం దక్షిణాదిన అంతటా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అటు తమిళంలో, ఇటు తెలుగులో ఈ చిత్రం సెన్సేషనల్ హిట్టయింది.
ఆ తర్వాత ఈ చిత్రాన్ని చిరంజీవి హీరోగా హిందీలో ఇదే పేరుతో తెరకెక్కించారు. అక్కడా బాగానే ఆడింది. ఈ ఒక్క సినిమాతోనే స్టార్ డైరెక్టర్ అయిపోయిన శంకర్ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. హీరో అర్జున్‌కు కూడా ఆ సమయానికి కెరీర్లో ఇదే అది పెద్ద హిట్. ‘జెంటిల్‌మేన్’ స్ఫూర్తితో తర్వాతి ఏళ్లలో మరెన్నో చిత్రాలు వచ్చాయి. ఒక మంచి పని కోసం బడా బాబుల్ని కొల్లగొట్టే హీరో పాత్రలు, కథలు మరెన్నో చూశాం. ఈ ఫార్ములా బాగా అరిగిపోయింది కూడా.
ఐతే ‘జెంటిల్‌మేన్’ వచ్చిన 27 ఏళ్ల తర్వాత ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ అనౌన్స్ చేయడం విశేషం. 90ల్లో ‘జెంటిల్‌మేన్’ సహా కొన్ని భారీ చిత్రాలు నిర్మించి సెన్సేషన్ క్రియేట్ చేసిన కేటీ కుంజుమోనే ఈ సీక్వెల్ ప్రకటన చేయడం విశేషం. ఇందులో వివిధ భాషలకు చెందిన పెద్ద తారలు నటిస్తారని కూడా ఆయన ప్రకటించారు. కానీ సీక్వెల్‌కు శంకరే దర్శకుడా కాదా అన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. శంకర్ ఇప్పటికే తన మరో బ్లాక్ బస్టర్ ‘భారతీయుడు’కు సీక్వెల్ తీస్తున్నాడు. లాక్ డౌన్ లేకుంటే ఈపాటికి ఆ చిత్రం పూర్తయ్యేది.
ఒకప్పటితో పోలిస్తే శంకర్ సత్తా తగ్గినప్పటికీ ఇంకా ఆయనతో సినిమాలు చేయడానికి హీరోలు, నిర్మాతలు లైన్లో ఉన్నారు. మరి కుంజుమోన్‌తో ‘జెంటిల్ మేన్’ చేయడానికి శంకర్ ఓకే అన్నాడా లేదా వేరే దర్శకుడెవరైనా ‘జెంటిల్ మేన్’ సీక్వెల్ తీయబోతున్నాడా అన్నది చూడాలి. నాగార్జునతో తీసిన ‘రక్షకుడు’ సినిమాతో గట్టి ఎదురు దెబ్బ తిన్న కుంజుమోన్.. తర్వాతి కాలంలో మరికొన్ని ఫ్లాపులు ఎదురవడంతో సినిమాలు మానేశారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన ‘జెంటిల్ మేన్’ సీక్వెల్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on September 11, 2020 3:20 pm
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…