Movie News

మూడు జానర్ల మధ్య ముచ్చటైన పోటీ

ఇవాళ శివరాత్రి పండగ సందర్భంగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒకదానికి మరొకటి సంబంధం లేని జానర్లు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విశ్వక్ సేన్ గామి మీద ఎంత అంచనాలు పెరిగాయో అడ్వాన్స్ బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. టాక్ కనక పాజిటివ్ వస్తే అద్భుతాలు చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. స్పిరిచువల్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన గామి ఏళ్ళ తరబడి నిర్మాణం జరుపుకుంది. ఇన్ని సంవత్సరాలు పడిన కష్టానికి తగిన గుర్తింపు ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం దర్శకుడు విద్యాధర్, హీరో విశ్వక్ లలో కనిపిస్తోంది.

మాస్ లో పట్టుండి వరస ఫ్లాపులతో మార్కెట్ తగ్గించుకున్న గోపిచంద్ కు భీమా బ్లాక్ బస్టర్ కావడం చాలా కీలకం. దేనికీ చెప్పనంత ప్రత్యేకంగా ఈ సినిమా గురించి ప్రోమోట్ చేసుకోవడం చూస్తే శాండల్ వుడ్ నుంచి వచ్చిన దర్శకుడు హర్ష మీద పెట్టుకున్న నమ్మకం బలంగా కనిపిస్తోంది. ఫాంటసీ టచ్ తో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ చేయకుండా అన్ని వర్గాలను టార్గెట్ చేసిన వైనం ట్రైలర్ లో కనిపించింది. ఇది హిట్ అయితే తర్వాత శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేస్తున్న సినిమాకు బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుంది. గుంటూరు కారం తర్వాత సరైన మాస్ సినిమా లేని లోటు కూడా తీరాలి.

వీటితో సమానంగా కాకపోయినా మలయాళం హిట్ ప్రేమలుని తెలుగులో తీసుకొచ్చిన ఎస్ఎస్ కార్తికేయ చక్కని ప్లానింగ్ తో ప్రీమియర్లతో పాటు రిలీజ్ ప్లాన్ చేసుకోవడంతో యూత్ లో దీని మీద క్రేజ్ ఉంది. హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళ చేతుల్లోనే ఉంది. బడ్జెట్ పరంగా రిస్క్ లేని వ్యవహారం కావడంతో గామి, భీమాల తరహాలో బ్రేక్ ఈవెన్ టెన్షన్ అంతగా ఉండదు. ఇవి కాకుండా రికార్డు బ్రేక్, బులెట్, బాబు, రాజుగారి అబ్బాయి నాయుడు గారమ్మాయి అనే చిన్న సినిమాలు ఇంకొన్ని వస్తున్నాయి కానీ వాటికి మినిమమ్ బజ్ కూడా లేదు. చూడాలి మరి శివరాత్రి విజేతగా ఎవరు నిలవబోతున్నారో.

This post was last modified on March 8, 2024 10:25 am

Share

Recent Posts

హీరోపై విరుచుకుపడిన అత్తగారు

తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…

8 minutes ago

ఈవెంట్లు ఒకటే కాదు… షూటింగులు కూడా జరగాలి

ఉమ్మడి రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయాక సినిమా పరిశ్రమకు సంబంధించిన చర్చలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల మధ్య ప్రస్తావనకు రావడం…

41 minutes ago

వారణాసి నుండి రామాయణం వరకు… జక్కన్న విధ్వంసం!

తాను తీసే సినిమా కథ గురించి ఆరంభ దశలోనే మీడియాతో విశేషాలు పంచుకోవడం దర్శక ధీరుడు రాజమౌళికి అలవాటు. ‘ఆర్ఆర్ఆర్’…

2 hours ago

పవన్ – రాజు గారి గురించి జరగాల్సిన చర్చ వేరు!

ఏపీలో రెండు రోజుల క్రితం ఓ కీలక అదికారిక కార్యక్రమం జరిగింది. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ…

2 hours ago

అలియాస్ రుక్మిణి… నితిన్ దారిలో పడ్డాడు

ఒకప్పుడు యూత్ ఫుల్ హిట్లతో మంచి ఊపు మీద ఉన్న నితిన్ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో వేగంగా చేసిన సినిమాలు…

2 hours ago

ప్యారడైజ్ ప్రీమియర్లకు ఎంత పెంపు ఉంటుంది

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాటు ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకున్న సినిమాగా…

2 hours ago