చిన్న సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు ఓటిటిలు ముందే కొనడానికి అంతగా ఆసక్తి చూపించవు. రిలీజయ్యాక ఫలితం చూసి అప్పుడో రేట్ ఆఫర్ చేస్తారు. నచ్చితే అమ్మొచ్చు లేదా ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. ఇలా జరిగే సందర్భాలు తక్కువ. ఇటీవలే మలయాళంలో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మంజుమ్మెల్ బాయ్స్ షూటింగ్ జరుగుతున్న టైంలో బడ్జెట్ సరిపోక నిర్మాతలు ఓటిటి డీల్స్ కోసం ట్రై చేశారు. కానీ టైటిల్ తో పాటు క్యాస్టింగ్ కూడా ఏమంత ఆసక్తికరంగా అనిపించకపోవడంతో ఆశించిన రేట్ రాలేదు. దీంతో చేసేది లేక ప్రొడ్యూసర్లు ఏదోలా విడుదల చేసుకున్నారు.
కట్ చేస్తే మంజుమ్మెల్ బాయ్స్ రెండు వారాలు దాటకుండానే 100 కోట్ల గ్రాస్ దాటేసి బాప్రే అనిపించింది. దీంతో అరెరే ఎంత పొరపాటు జరిగిందని భావించిన ఓటిటిలు హుటాహుటిన తమ ప్రతినిధులను నిర్మాత దగ్గరకు పంపించాయి. మొదట్లో ఆయన చెప్పిన రేట్ కంటే పదింతలు ఎక్కువ ఇవ్వడానికి సిద్ధ పడుతున్నారట. ఒకవేళ త్వరగా స్ట్రీమింగ్ కు ఒప్పుకుంటే ఈ మొత్తం ఇంకా పెరుగుతుంది. వస్తున్న ఆఫర్లు చూసి విశ్లేషించే పనిలో పడ్డ ప్రొడ్యూసర్ ఇంకా ఎవరికీ మాట ఇవ్వలేదని తెలిసింది. యాభై రోజుల తర్వాతే డిజిటల్ లో వచ్చేలా మంచి ధరకు త్వరలోనే ఫైనల్ చేస్తారట.
ఇక తెలుగు డబ్బింగ్ సంగతికొస్తే మార్చి 15 విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒరిజినల్ వెర్షన్ నిర్మాతలే ఏపీ తెలంగాణలో మైత్రి ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఒప్పందం జరిగిందని సమాచారం. పలువురు టాలీవుడ్ ప్రొడ్యూసర్లు డబ్బింగ్ రైట్స్ కోసం పోటీ పడినప్పటికీ ఎవరికీ ఇవ్వలేదని సమాచారం. అనువాదమే అయినా తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ డబ్బింగ్ వెర్షన్ కి ది బాయ్స్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలిసింది. ఇలాంటి చిన్న సినిమాలు చేసే అద్భుతాల గురించి ముందే ఊహించడం కష్టం.
This post was last modified on March 8, 2024 10:01 am
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…