యాభై రోజులు దాటినా ఇంకా హనుమాన్ ఓటిటిలో రాలేదేమిటా అని ఎదురు చూస్తున్న సినీ ప్రేమికులకు ట్విస్టు ఇస్తూ హఠాత్తుగా ఊరు పేరు భైరవకోన నిన్న అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ ద్వారా స్టీమింగ్ లోకి వచ్చేసింది. సంక్రాంతి తర్వాత అంతో ఇంతో చెప్పుకోదగ్గ హిట్టు ఇదొక్కటే. ఫిబ్రవరి నెల మొత్తం చాలా డ్రైగా ఉన్న టైంలో ఆడియన్స్ థియేటర్లకు వచ్చేందుకు పెట్టుకున్న ఒకే ఛాయస్ గా ఈ సినిమా నిలిచింది. చాలా చోట్ల మూడో వారం వీకెండ్స్ లో మంచి వసూళ్లు నమోదు చేస్తూ వచ్చింది. భీమా, గామి, ప్రేమలు వచ్చినా కూడా మెయిన్ సెంటర్స్ లో కొనసాగిస్తున్నారు.
ఏదైతేనేం చెప్పా పెట్టకుండా వచ్చినా, చెప్పి వచ్చినా పండగ రోజు ఆడియన్స్ లో ఇంట్లో చూసేందుకు ఒక ఆప్షన్ దొరికింది. నిజానికి దీని డిజిటల్ హక్కులు జీ5 సొంతం చేసుకుందనే ప్రచారం జరిగింది కానీ దీన్ని బట్టి చూస్తే అది కేవలం శాటిలైట్ కు మాత్రమే పరిమితమని క్లారిటీ వచ్చేసింది. సందీప్ కిషన్, వర్ష బొల్లమ, కావ్య థాపర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ థ్రిల్లర్ కు విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈయన పనితనం చూసే నిర్మాత అనిల్ సుంకర తన సంస్థలోనే ఇంకో ఆఫర్ ఇచ్చారు. హీరో ఎవరనేది ఇంకా తెలియలేదు కానీ స్టారే ఉండొచ్చని టాక్.
ఊరు పేరు భైరవకోనతో పాటు ట్రోలింగ్ కు గురైన చైతన్య కృష్ణ బ్రీత్ ఆహాలో వచ్చేసింది. దీనికి సోషల్ మీడియాలో మంచి పబ్లిసిటీ ఇవ్వడం గమనార్హం. బాక్సాఫీస్ వద్ద ఎవరూ పట్టించుకోని ఈ సినిమాకి భారీ వ్యూస్ వస్తాయనే అంచనాలున్నాయి. విజయ్ సేతుపతి- కత్రినా కైఫ్ ల మెర్రీ క్రిస్మస్ తెలుగుతో పాటు హిందీ, తమిళంలో నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది. ట్విస్టు ఏంటంటే ఇవన్నీ థ్రిల్లర్లు కావడం విశేషం. భక్తి అంశాలున్న హనుమాన్ మాత్రం ఇంకా ఆలస్యమయ్యేలా ఉంది. వచ్చే వారమైనా ఉంటుందా లేక ఇంకేదైనా కారణం వల్ల వాయిదా వేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
This post was last modified on March 8, 2024 9:57 am
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…