వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేషన్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’. ఇప్పుడీ ఊరి పేరుతో ఓ సినిమా రూపొందుతోంది.
‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్ రాజ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’.. అనేది ఉపశీర్షిక.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లంబసింగి చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మొదటిపాట ‘నచ్చేసిందే నచ్చేసిందే…’ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
తాజాగా ఈ సినిమా నుండి వయ్యారి గోదారి సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. జవేద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ ను కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించారు. డిఫరెంట్ మెలోడీ గా సాగే ఈ సోంగ్ కు మ్యూజిక్ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మార్చి 15న ప్రపంచ వ్యాప్తంగా లంబసింగి సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.
This post was last modified on March 7, 2024 10:18 pm
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…