యూత్ ని టార్గెట్ చేసుకుని హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తీసిన మలయాళం సినిమా ప్రేమలు కేరళలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో చూస్తున్నాం. తెలుగు డబ్బింగ్ వెర్షన్ అదే టైటిల్ తో ఈ శుక్రవారం రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ కార్తికేయ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ అనువాదం, ప్రమోషన్ వగైరా కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్నాడు. మార్చి 8 దీంతో పాటు విశ్వక్ సేన్ గామి, గోపీచంద్ భీమా విడుదలవుతున్నాయి. అజయ్ దేవగన్-మాధవన్ బాలీవుడ్ హారర్ సైతాన్ కూడా చెప్పుకోదగ్గ అంచనాలతో థియేటర్లలో అడుగు పెడుతోంది.
వీటితో కాంపిటీషన్ ని దృష్టిలో పెట్టుకుని ఇటీవలి కాలంలో ట్రెండ్ గా మారిపోయిన ముందు రోజు ప్రీమియర్లకు ప్రేమలు రెడీ అయిపోయింది. మార్చి 7 సాయంత్రం ముఖ్యమైన కేంద్రాల్లో షోలు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. హైదరాబాద్ ఏఎంబి, ఏఏఏ, ప్రసాద్ మల్టీప్లెక్సు బుకింగ్స్ ఆల్రెడీ మొదలైపోయాయి. మిగిలిన చోట్ల మెల్లగా యాడ్ చేసుకుంటూ వెళ్తారు. మేజర్ నుంచి బేబీ దాకా ఎన్నో సినిమాలకు ఈ స్ట్రాటజీ బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది. ఇలా వేయడం వల్లే రంగబలి నుంచి ట్రూ లవర్ దాకా దెబ్బ తిన్నవి లేకపోలేదు. సో ఇది రెండు వైపులా పదునున్న రిస్క్.
ఆల్రెడీ ఒరిజినల్ వెర్షన్ ప్రూవ్ చేసుకున్నదే కాబట్టి తెలుగులోనూ అదే స్పందన దక్కుతుందనే ధీమాలో ఉన్నారు దర్శక నిర్మాతలు. పైగా కేవలం వారం గ్యాప్ లో ఇంకో మల్లువుడ్ సెన్సేషన్ మంజుమ్మెల్ బాయ్స్ ని తెస్తున్నారు. ఆలోగానే ప్రేమలు వీలైనంత రాబట్టుకోవాలి. బిజినెస్ పరంగా తక్కువ పెట్టుబడి కాబట్టి టాక్ పాజిటివ్ గా వస్తే వసూళ్ల రూపంలో యూతే తిరిగి ఇచ్చేస్తారు. కాకపోతే ఆ స్థాయిలో కనెక్ట్ అవ్వాలి మరి. మంచి ట్రెండీ కంటెంట్ తో రూపొందిన ప్రేమలు హీరో హీరోయిన్లు ఆల్రెడీ భాగ్యనగరంలోనే మకాం వేసి ఇంటర్వ్యూలు గట్రా తెగ ఇచ్చేస్తున్నారు.
This post was last modified on March 5, 2024 2:34 pm
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…